బాబు మా భూముల్ని ఆక్రమిస్తే..ఇంకెందుకు సబ్‌ప్లాన్ సభలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు మా భూముల్ని ఆక్రమిస్తే..ఇంకెందుకు సబ్‌ప్లాన్ సభలు

బాబు మా భూముల్ని ఆక్రమిస్తే..ఇంకెందుకు సబ్‌ప్లాన్ సభలు

Written By news on Monday, April 29, 2013 | 4/29/2013

బాలాయపల్లి, న్యూస్‌లైన్ : ‘ప్రభుత్వ అధికారులు ఆ సభలు.. ఈ సభలని వస్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా భూములు ఆక్రమించారు.. మాకు న్యాయం చేయండి. తొమ్మిదేళ్లుగా మేము తిరగని కార్యాలయం.. అడగని అధికారి లేడు. అధికారులు పట్టించుకోరు. మాకు న్యాయం చేయలేనప్పుడు ఇంకెందుకు ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ సభలు’ అని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలోని వాక్యం గ్రామం లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న అధికారులను నిండలిలో నిలదీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, నిండలి గ్రామంలోని సర్వే నంబరు 139లోని ప్రభుత్వ భూములను 2004లో 18 మందికి పట్టాలిచ్చారు.

ఈ రోజుకూ ఆ భూములు ఎక్కడున్నాయో మాకు చూపలేదు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన తోటపొలంలో మా భూములను కలిపి ఆక్రమించుకున్నారు. కూలికి పోతేకానీ పూటగడవని మాలాంటోళ్లకు ఇచ్చిన భూములను చంద్రబాబు ఆక్రమించడం అన్యాయం. మా భూములు ఎక్కడున్నాయో చూపమని రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగినాం. గతంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహశీల్దార్ పూర్ణచంద్రరావు దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు. మా భూములు ఆక్రమించిన మా కడుపుకొట్టిన ఆయనకు మా ఉసురు తగలకపోతాదా అంటూ శాపనార్థనాలు పెట్టారు. పోయినేడాది పేపర్లలో వార్తలొచ్చిప్పడు రెండురోజులు అధికారులు వచ్చారు.. పోయారు.

ఇంతవరకు మా సమస్యను పరిష్కరించలేదు. చంద్రబాబుకు,సీఎం కిరణ్‌కు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే మా భూములు మాకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త చెరువు పోరంబోకు భూములనూ చంద్రబాబునాయుడు ఆక్రమించారని నిండలి గ్రామరైతులు ఈ సందర్భంగా విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఏటా పంటకు నీరు చాలక ఎండబెట్టుకుంటున్నామన్నారు. పశువులకు నిర్మించినఅన్నప్పగుంతను పూడ్చేసి చంద్రబాబునాయుడు ఆయన తోటలో కలిపేసుకున్నారు. వర్షం వస్తే అన్నప్పగుంత నిండి పాత చెరువుకి నీళ్లొచ్చే వరవ కాలువను ఆక్రమించారు. 15 ఏళ్లుగా పాత చెరువు నిండిన దాఖలాలు లేవని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి వరవ కాలువను భూములకు హద్దులు చూపాలని కోరుతున్నారు.
Share this article :

0 comments: