బాబూ మాట్లాడవేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ మాట్లాడవేం?

బాబూ మాట్లాడవేం?

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013

నిలదీసిన అంబటి రాంబాబు
మీరు కూడా కాంగ్రెస్‌తో భాగస్వాములయ్యారా?
కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ ఉందని రుజువైంది
కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను నిర్బంధించారు

సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థులుగా మారిన రాజకీయనాయకులను వేధించేందుకే సీబీఐ ఒక ఆయుధంగా పనిచేస్తుందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో చీమచిటుక్కుమన్నా నానా యాగీ చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. సీబీఐ ధోరణిపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు పెదవి విరుస్తున్నప్పటికీ పెదవి విప్పకపోవడంలో మతలబేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మారిన సీబీఐలో చంద్రబాబు కూడా భాగస్వామ్యం అయినట్లున్నారని విమర్శించారు. జగన్ కేసు విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏది చెబితే సీబీఐకి అది వేదంలా కనబడుతోందని వ్యాఖ్యానించారు. జగన్ కేసుకు సంబంధించి ముక్కలు ముక్కలుగా చార్జీషీట్లు వేయాలని ఆ రెండు పార్టీ చెప్పినట్లు సీబీఐ తలూపుతోందని విమర్శించారు. సీబీఐ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ

కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ పనిచేస్తోందని గతంలో తాము అనేక సందర్భాల్లో చేసిన వాదనలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుతుందని అంబటి తెలిపారు. బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సంస్థ చేసే దర్యాప్తు ఏవిధంగా సాగుతోందనే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును ముందే కేంద్ర న్యాయశాఖమంత్రి, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో దేశం నివ్వెరపోయిందని చెప్పారు. 

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం అందించడంలో ప్రధానమంత్రి కార్యాలయం నిమగ్నమైందంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన చర్య మరొకటి ఉండదని విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న బొగ్గుకుంభకోణం కేసు పరిస్థితి ఈ విధంగా ఉంటే రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వారి కేసుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తుల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై దర్యాప్తు ఏవిధంగా సాగుతుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీబీఐ చేస్తున్నది దర్యాప్తు కాదని జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీపై దౌర్జన్యం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకొచ్చారనే దురుద్దేశంతోనే జగన్‌పై కత్తిగట్టి పదకొండు నెలలుగా నిర్బంధించారని చెప్పారు. ఈ విషయమై తాము గతంలో రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
Share this article :

0 comments: