ప్రజాస్వామ్య రథ చక్రాలొస్తున్నాయ్... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్య రథ చక్రాలొస్తున్నాయ్...

ప్రజాస్వామ్య రథ చక్రాలొస్తున్నాయ్...

Written By news on Monday, April 29, 2013 | 4/29/2013

జగన్‌కు బెయిలొస్తే పండుగ చేసుకుందామని చాలామంది ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూసే లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. సీబీఐ ఎలాగైనా జగన్‌కు బెయిల్‌కు అడ్డం పడాలని, న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. అది ఇంతకుముందే న్యాయవ్యవస్థను బెదిరించే దుష్ట క్రీడను ఆరంభించింది. జనం జగన్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి ధర్మమే గెలుస్తుందని, జగన్ జననేతగా నిలబడతాడని గాఢంగా నమ్ముతున్నారు. జగన్ కేసుతో సీబీఐ ఇప్పటికే కొండంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దేశంలోని దీని విశ్వసనీయతపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నియంత విధానాలకు, దుష్ట అప్రజాస్వామిక పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు వచ్చే కొత్త పాలకులు ఈ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్వరూపాన్ని, స్వభావాన్ని అనివార్యంగా మార్చి తీరతారు. ఆరోజు ఇంకెంతో దూరంలో లేదు.

మరి న్యాయవ్యవస్థ మాటేమిటి? న్యాయమూర్తులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి పెరిగిపోతున్నట్లు ప్రధానన్యాయమూర్తులే వాపోతున్నారు. ఇప్పటివరకూ న్యాయస్థానాలు చెప్పినట్లు ప్రభుత్వాలు నడుచుకునేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయినట్లనిపిస్తోంది. ప్రభుత్వాలు చెప్పినట్లు న్యాయస్థానాలు నడుచుకోవలసిందేనా? ఉన్నత పదవులు, ప్రమోషన్లు, లగ్జరీ సౌకర్యాలు కలిగిన పీఠాలకోసం న్యాయమూర్తులు కూడా సామాన్య ఉద్యోగుల్లాగే ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారా? జగన్ కేసుల పరంపర పర్యావసానాలు ప్రజలకు ఈ అనుమానాన్నే రేకెత్తించాయి. అన్యాయంగా, అప్రజాస్వామికంగా, తన భర్తను జైలుపాలు చేస్తే ఆ ఆవేదనతో భారతిగారు ఏమన్నారో తెలుసా - ‘న్యాయవ్యవస్థ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. ఇప్పుడు అంతకంటే నేను చేయగలిగింది కూడా ఏమీలేదు.’ కళ్లకు గంతలు కట్టించుకున్న న్యాయదేవతకు కూడా ఈ మాటలు వినిపించే ఉంటాయి. న్యాయం గెలుస్తుంది. జగన్ బయటకొస్తాడు. పెద్దాయన పుణ్యం ఊరికే పోదు. అది జగన్‌ను కాపాడుతుంది.

చేతిలో చిల్లిగవ్వలేని నిరుపేదకు గుండెపోటు వస్తే, డబ్బు ఆయనే కట్టి ఆపరేషన్ చేయించి ప్రాణం నిలిపారు వైయస్సార్. నిరుపేద విద్యార్థులకు డబ్బు కట్టి, పైచదువులు చదివించారు. ప్రాజెక్టులు ప్రారంభించారు. వ్యవసాయానికి పెద్దపీట వేశారు. మట్టిని, మనిషిని ప్రేమించారు. చేనునీ చెట్టునీ ప్రేమించారు. పదిమంది మేలు కోసం ఆలోచించారు. ప్రజలందరి బాధనూ తనలో పలికించారు. అలాంటాయన మాకు రక్షకుడు. ఆయన కుమారుడు మాకు రక్షకుని కుమారుడు. అతడిని జైల్లో పెడతారా? అక్రమంగా, అన్యాయంగా కేసుల్లో ఇరికించి అణగదొక్కాలని చూస్తారా? జగన్‌కు జనం నీరాజనం పడుతుంటే, తల్లులు జగన్‌ను చేరదీసి తమ కొంగుతో అతని ముఖంపై చెమటను తుడుస్తుంటే, అమ్మమ్మలు తమ క్యారేజీలో అన్నం ఆయనకు తినిపిస్తుంటే, చెల్లెళ్లు తమ బిడ్డలను జగన్ చేతికిచ్చి, ‘అన్నా! నా బిడ్డకు పేరు పెట్ట’మంటుంటే, ప్రజలందరూ అంత అభిమానించే జగన్‌ను మీరు జైల్లో పెడతారా? పెద్దాయన చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తారా? జాగ్రత్త! ప్రజాస్వామ్య రథచక్రాలొస్తున్నాయ్. మాడిపోతారు. మసైపోతారు. గద్దెనెక్కిన గద్దలారా! పదవులొదిలి పారిపోండి. బతికిపోండి.

- మాదు వసంతరావు, కంకిపాడు, కృష్ణాజిల్లా
Share this article :

0 comments: