తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు

తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

తన కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లలో సీబీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని...తాను అమాయకుడినని... సీబీఐ ఆరోపించినట్లుగా ఏ నేరం చేయలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీబీఐ చేసినవన్నీ ఊహాజనిత ఆరోపణలేనని తెలిపారు. జగన్‌ అక్రమార్జన కేసులో ఈనెల 2న అరెస్టయిన తనకు బెయిలు మంజూరు చేయాలంటూ విజయసాయిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ కంపెనీలకు వృత్తి రీత్యా ఛార్టెడ్‌ అకౌంటెంట్‌, ఆర్థిక సలహాదారుగా మాత్రమే ఉన్నానని చెప్పారు. ఇంతకు మినహా జగన్‌ గ్రూపు కంపెనీల్లో ఎలాంటి పాత్రా లేదని స్పష్టం చేశారు. అందువల్ల అక్రమంగా ఆర్జించిన సొమ్మును పెట్టుబడులుగా మార్చడానికి సంబంధించిన కుట్ర వెనుక ప్రధాన పాత్రధారి అన్న ఆరోపణ అవాస్తవమని తెలిపారు. కుట్రకు సంబంధించి తనకు మాత్రమే తెలుసన్న ఆరోపణ కూడా సరికాదన్నారు. తనకు 30 సార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి పలువురు సీబీఐ అధికారులు విచారించారని చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా సీబీఐ అధికారులకు వెల్లడించానని, దర్యాప్తునకు సహకరించినట్లు చెప్పారు. తనపై మోపిన ఐపీసీ కింద 420, 409, 477(ఎ) సెక్షన్లు వర్తించవన్నారు. ఈ సెక్షన్లు వర్తించే నేరాలేవీ తాను చేయలేదని చెప్పారు. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు. తనపై ప్రాథమికంగా ఎలాంటి కేసునూ సీబీఐ నిరూపించలేకపోయిందని తెలిపారు. 300 గంటల పాటు విచారించారని, అందువల్ల తాను దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశమే లేదని చెప్పారు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, సాక్షులను ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేయనని, సాక్ష్యాలను తారుమారు చేయబోనని హామీ ఇచ్చారు. విచారణకు, దర్యాప్తునకు అందుబాటులో ఉంటానని, బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు సీబీఐ కౌంటర్‌ నిమిత్తం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.ప్రత్యేక కేటగిరీ కల్పించండి..సునీల్‌రెడ్డి: ఎమ్మార్‌ కేసులో అరెస్టయిన తనను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించేలా జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేయాలంటూ సునీల్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బీఏ డిగ్రీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివిన తాను కాంపు లర్న్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో మార్కెటింగ్‌ మేనేజరుగా రూ.1.50లక్షల జీతం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలో డైరెక్టర్‌గా చేరానని, రూ.2 లక్షల వేతనం పొందుతున్నట్లు చెప్పారు. రూ.6 లక్షల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, వ్యాపారం నిర్వహిస్తున్న భార్య రూ.26 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతప్రమాణాలతో జీవనం గడుపుతున్న తనను ప్రత్యేకకేటగిరీగా పరిగణించి వసతులు కల్పించేలా జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీబీఐ వివరణ కోరుతూ కోర్టు ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. రంగారావు ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ 30న: ఎమ్మార్‌ కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ తుమ్మల రంగారావు పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం సీబీఐ కౌంటరు దాఖలు చేయాల్సి ఉండగా అది చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది.
Share this article :

0 comments: