'బాలయ్యా! నీచ రాజకీయాలకు బలి కావద్దు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బాలయ్యా! నీచ రాజకీయాలకు బలి కావద్దు'

'బాలయ్యా! నీచ రాజకీయాలకు బలి కావద్దు'

Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012

నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. 

నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు. చిరంజీవి అన్నట్లు బాలకృష్ణది చిన్నపిల్లవాడి మన:స్తతత్వం అన్నారు. బాలకృష్ణకు రాజకీయ అవగాహనలేదని చెప్పారు. నీ తప్పులు కప్పిపుచ్చుకోవడమేకాకుండా, అవినీతిపరుడైన బావ తప్పులను కూడా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నావా? అని ఆమె బాలకృష్ణని ప్రశ్నించారు. కోట్లకు పడగెత్తిన చంద్రబాబు నాయుడు అవినీతిపై మాట్లాడమని ఆమె సలహా ఇచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ తండ్రి నీతో ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని ఆమె బాలకృష్ణని కోరారు.
Share this article :

0 comments: