మూడెకరాల భూమిని చంద్రబాబునాయుడి భార్య ఎకరా కోటి రూపాయల చొప్పున - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడెకరాల భూమిని చంద్రబాబునాయుడి భార్య ఎకరా కోటి రూపాయల చొప్పున

మూడెకరాల భూమిని చంద్రబాబునాయుడి భార్య ఎకరా కోటి రూపాయల చొప్పున

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

* తక్కువ ధరకు భూములను కట్టబెట్టింది ఆయనే...
* ఎకరా నాలుగైదు కోట్లు పలికే భూములను రూ.29 లక్షలకే ఇచ్చారు
* అదే బాబు... అంతకుముందు మూడేళ్ల కిందట తన భార్య పేరిట ఉన్న భూములను ఎకరా కోటి చొప్పున అమ్ముకున్నారు
* ఈ అవినీతి సీబీఐకి కనిపించడం లేదా?
* దాని దర్యాప్తు పక్కదారి పట్టింది..
* అసలు దోషిని వదిలి వైఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
* సునీల్‌రెడ్డి నాకు ఎలా బంధువో సీబీఐ వారే చెప్పాలి
* నాకంటే పదేళ్లు చిన్నవాడైన సునీల్‌రెడ్డిని వైఎస్ వాడుకున్నారనడం ఎంతవరకు సమంజసం?

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మార్ భూ కేటాయింపు కేసుల్లో అసలు దోషి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వదిలేసి సీబీఐ... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా 4 కోట్ల నుంచి 5 కోట్ల ధర పలికే భూములను కారుచౌకగా ఎమ్మార్‌కు కట్టబెట్టింది చంద్రబాబేనని చెప్పారు. పులివెందుల వాడైతే చాలు.. ఒక రెడ్డి ఇంకో రెడ్డికి ఏదో ఒక రకంగా బంధువు అవుతాడు కదా అన్న ఆలోచనతో సీబీఐ... ఎలాంటి తప్పు చేయని సునీల్‌రెడ్డిని పట్టుకెళ్లి వేధింపులకు గురిచేస్తోందని అన్నారు. సునీల్‌రెడ్డికి తమకు ఉన్న బంధుత్వం ఏమిటో సీబీఐనే చెప్పాలన్నారు. 

గుంటూరు జిల్లాలో 57వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం జగన్ గురజాల నియోజకవర్గం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అం జనాపురంలో బొజ్జా యోగిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. మొత్తం 14 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంట అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత ఉన్నారు. పలు గ్రామాల్లో జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

భూములిచ్చిన వారిని వదిలేస్తోంది..
ఈ ఎమ్మార్‌కు ముందు భూములిచ్చింది ఎవరు అని నేను అడుగుతున్నా.. ఎమ్మార్‌కు తక్కువ ధరకే చంద్రబాబు నాయుడుగారు 535 ఎకరాలను ధారాదత్తం చేశారు. ఈ భూములను కట్టబెట్టేందుకు మూడు సంవత్సరాల ముందు అక్కడే తన పేరిట ఉన్న మూడెకరాల భూమిని చంద్రబాబునాయుడి భార్య ఎకరా కోటి రూపాయల చొప్పున రెడ్డి లేబోరేటరీస్‌కు చెందిన అంజిరెడ్డిగారికి అమ్మింది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత అంటే... అక్కడ ఎకరా భూమి ధర కనీసం నాలుగు కోట్ల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా ఉంటుంది. కానీ ఇదే చంద్రబాబునాయుడు ఎకరాకు రూ.29 లక్షలకే ఆ భూములను ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారు. ఇది సీబీఐకి కనిపించడం లేదా? సీబీఐ ఏమైనా చేయాలంటే ముందుగా బాబు చేసిన అవినీతిని కనిపెట్టాలి.. ఆ డబ్బు ఎక్కడికి పోయిందని అడగాలి.. కానీ సీబీఐ పక్కదారి పట్టింది. దానికి కావాల్సింది చంద్రబాబు కాదు.. జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా దెబ్బతీయాలన్న ఒకే ఒక ఆలోచనతో అది వ్యవహరిస్తోంది. 

నాడు చంద్రబాబు చేసిన ఈ తప్పులను సరిదిద్దేందుకు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి... రోశయ్య అధ్యక్షతన ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఎమ్మార్‌కు భూముల కేటాయింపుల్లో ఏమైనా అక్రమాలు ఉంటే చూడండి.. అని ఆ కమిటీకి సూచించారు. తర్వాత ఆ సబ్ కమిటీ చేసిన సిఫారసులను కేబినెట్ కూడా ఆమోదించింది. అప్పుడు అందరు కూడగట్టుకొని వచ్చి.. ఇది మల్టినేషనల్ కంపెనీ, ఈ కంపెనీ వెనక్కి తిరిగి వెళ్లిపోతే చెడ్డపేరు వస్తుందని చెప్పారు. చివరికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టేటట్లుగా చేసి వారికే అగ్రిమెంటు చేశారు. ఎమ్మార్‌పై సిఫారసులు చేసింది రోశయ్య కమిటీ అయితే మధ్యలో వైఎస్ రాజశేఖరెడ్డి ఎక్కడ్నుంచి వచ్చారని సీబీఐని అడుగుతున్నా. ఇలా దివంగత నేతను అప్రదిష్టపాలు చేయడానికి ఇంతటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.

పులివెందుల వ్యక్తి అయితే చాలా?
సునీల్‌రెడ్డి మాకు బంధువు అని, ఆ దివంగత నేత వైఎస్సార్ ఆ పిల్లోన్ని వాడుకున్నాడని సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. సునీల్‌రెడ్డికి మాకు ఉన్న బంధుత్వం ఏమిటో సీబీఐనే చెప్పాలి. సునీల్‌రెడ్డి మాకు ఎక్కడో దూరపు బంధువు. ఒక రెడ్డికి మరో రెడ్డికి ఎక్కడో ఒక చోట బంధుత్వం కలుస్తుందని భావించి, ఎలాంటి ఆధారాలు అక్కర్లేకుండానే పులివెందులకు చెందిన వ్యక్తి అయితే చాలనుకొని ఆ పిల్లాడిని అడ్డంపెట్టుకొని వైఎస్‌పై బురద చల్లవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. ఆ పిల్లాడిని దివంగత నేత వాడుకున్నాడని చెప్పి సీబీఐ అభాండాలు వేస్తోంది. 

రాజశేఖరరెడ్డి గారి వయసెంత? ఆ పిల్లాడి వయసెంత? ఒకవేళ వైఎస్సార్ వాడుకోవాలి అనుకుంటే నాకంటే పదేళ్లు చిన్నవాడైన అంత చిన్న పిల్లాడిని వాడుకుంటారా? ఇవన్నీ తెలిసి కూడా వైఎస్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే సునీల్‌రెడ్డి భార్య నా భార్య దగ్గరకు వచ్చి.. ‘‘అక్కా.. సీబీఐ వాళ్లు నా భర్తను పట్టుకొనిపోయారు. అబద్ధాన్ని నిజమని చెప్పించేందుకు, పేరు చెప్పించేందుకు మా ఆయన్ని కొడతారేమో..’’ అని చెప్పినప్పుడు నాకు ఎంతగానో బాధనిపించింది. 

జగన్‌పై ఈగ వాలినా సహించం: సబ్బం
గురజాల (గుంటూరు), న్యూస్‌లైన్: జగన్‌కు ప్రజలంతా అండగా ఉన్నారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. ఆయనపై ఈగ వాలినా రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడూ మిగలడన్నారు. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘కాల్చి చంపండి’ అన్న జగన్ వ్యాఖ్యలు విని తాను తీవ్రంగా కలత చెందానన్నారు. ఆయనపై, ఆయన కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలోనే బాధతో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని వివరించారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఆయనను నేరుగా ఏమీ చేయలేక.. ఆయన అనుచరులు, దూరపు బంధువులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వివక్షతో, పక్షపాతంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలపై సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: