వయసులో పెద్దవాళ్లు.. మీ మాదిరిగా నేను నోరు పారేసుకుంటే మీకు గౌరవం లేకుండా పోతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వయసులో పెద్దవాళ్లు.. మీ మాదిరిగా నేను నోరు పారేసుకుంటే మీకు గౌరవం లేకుండా పోతుంది

వయసులో పెద్దవాళ్లు.. మీ మాదిరిగా నేను నోరు పారేసుకుంటే మీకు గౌరవం లేకుండా పోతుంది

Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012

* నీ మీద, నీ ఆస్తుల మీద, కుటుంబ సభ్యుల ఆస్తుల మీద విచారణ వేయించుకుని నిజాయతీ నిరూపించుకో
* రెండెకరాల ఆసామివి.. వేల కోట్లు ఎలా సంపాదించావు?
* అదెలాగో..రూ. వంద గిట్టక బతుకుపోరు చేస్తున్నపేదలకు చెప్పండి..
* గుడిసెల్లో ఉంటున్న అక్కాచెల్లెమ్మలకు చెప్పండి 
* వైఎస్సార్ చనిపోయి రెండున్నరేళ్లు అవుతున్నా.. ఆయన పేరు తలవని రోజు లేదు 
* వయసులో పెద్దవాళ్లు.. మీ మాదిరిగా నేను నోరు పారేసుకుంటే మీకు గౌరవం లేకుండా పోతుంది
* నేను ఢిల్లీతో పోరాటం చేస్తుంటే.. నువ్వు అదే ఢిల్లీతో కుమ్మక్కయ్యావు 
* అబద్ధాలు చెప్పడం కాదు.. చేతనైతే ప్రజల్లోకి రండి
* చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికుండాలో వైఎస్‌ను చూసి నేర్చుకోండి

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సత్తా ఉంటే ఆయన మీద, ఆయన ఆస్తుల మీద, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల మీద సీబీఐ విచారణ వేయించుకుని.. నిజాయతీ నిరూపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నది కేవలం రెండెకరాల భూమి. మరి ఈ వేళ పొరుగు రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ దుకాణాలు తెరిచి.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా 54వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన ఆదివారం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 9 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాట్రపాడులో రెడ్డిచర్ల కృష్ణంరాజు కుటుంబాన్ని ఓదార్చారు. ముత్యాలంపాడు, దాచేపల్లి, నారాయణపురం గ్రామాల్లో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

‘‘వైఎస్సార్ ఒక మంచి మనిషి. విలువలున్న మనిషి. విశ్వసనీయతకు అర్థం తెచ్చిన మనిషి,. ఆయన చనిపోయి దాదాపు రెండున్నర ఏళ్లు అయిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు పట్టుకుంటే చాలు వైఎస్సార్ గురించే మాట్లాడుతారు. రోజుకొక అబద్ధం చెబుతాడు.. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతాడు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎందాకైనా పోవడానికి వెనుకాడని వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో లక్ష కోట్ల గురించి మాట్లాడారు. ఇక్కడ నేను చంద్రబాబునాయుడు గారిని ఒకే ఒక్క మాట అడుగుతున్నా..! అయ్యా..! మీరు వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్లు. మీరు ఏ మాదిరిగా మాట్లాడారో.. అదే మాదిరిగా నేను కూడా నోరు పారేసుకుంటే మీకు గౌరవం కూడా లేకుండా పోతుంది. అయ్యా.. చంద్రబాబు.. లక్షల కోట్ల గురించి మీరు మాట్లాడుతారు. 

నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. 1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకు ఉన్న ఆస్తి కేవలం రెండు ఎకరాలు కాదా? ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు, చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూస్తే అక్కడ హెరిటేజ్ దుకాణాలు ఎడాపెడా కనపడుతుంటాయి. నేను అడుగుతున్నాను.. చంద్రబాబు నాయుడు.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు? మాకూ చెప్పండి.. రూ.వంద కూడా గిట్టక బతుకంతా పోరాటం చేస్తున్న పేదలకు చెప్పండి.. గుడిసెల్లో ఉంటున్న ఆ అక్కాచెల్లెమ్మలకు చెప్పండి.. రెండు ఎకరాల నుంచి వేల కోట్లు ఎలా సంపాదించాలో వారందరికీ చెప్పండి.’’ 

అబద్ధాలు చెప్పడం కాదు.. చేతనైతే ప్రజల్లోకి రండి.. 
‘‘ఇదే చంద్రబాబు గారికి ఇవాళ ఒక సవాల్ విసురుతున్నా.. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాక ముందు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని నిర్వచనం చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు. అదే కాంగ్రెస్‌తో నేను విశ్వసనీయత కోసం, విలువల కోసం పోరాటం చేస్తున్నాను. నేను ఢిల్లీతో పోరాటం చేస్తుంటే.. ప్రతిపక్షంలో ఉన్న నీవు అదే ఢిల్లీతో కుమ్మక్కయ్యావు. ఢిల్లీతో కలిసి రాజకీయాలు చేస్తున్నావు. చంద్రబాబూ.. సవాల్ వేసి చెప్తున్నాను. నీమీద, నీ ఆస్తుల మీద, నీ కుటుంబ సభ్యుల ఆస్తుల మీద సీబీఐ విచారణ వేసుకో, వేసుకున్న తరువాత ప్రజల దగ్గరకు రా.. వచ్చి సచ్ఛీలునిగా నిలబడు. సత్తా ఉంటే రా.. చంద్రబాబునాయుడు అని సవాల్ విసురుతున్నా. ఇవాళ మీరు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం కాదు. చేతనైతే ప్రజల్లోకి రండి.. చేతనైనంతగా వారికి సేవ చేయండి. చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికి ఉండాలో దివంగత వైఎస్సార్‌ను చూసి నేర్చుకోండి.’’ 

వస్త్ర వ్యాపారుల సమస్య పట్టదా?
‘‘వ్యాట్ తగ్గించమని ఆరు నెలలుగా వస్త్ర వ్యాపారులు కోరుతున్నారు. బట్టల దుకాణాలు బందు పెట్టి, సమ్మెకు దిగారు. అయినా వారి సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మళ్లీ సమ్మెకు దిగుతామని వాళ్లు హెచ్చరించినా.. ఈ చేతగాని పాలకుల వల్ల అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. రాబోయే సువర్ణయుగంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ఆ దివంగత నేత ఆకాశం నుంచి చూసి గర్వపడే విధంగా ఆ సువర్ణ పాలన ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాను.’’
Share this article :

0 comments: