ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల్ని అతి కిరాతకంగా పాతరేయడంలో కాంగ్రెస్‌ మరో అడుగు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల్ని అతి కిరాతకంగా పాతరేయడంలో కాంగ్రెస్‌ మరో అడుగు

ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల్ని అతి కిరాతకంగా పాతరేయడంలో కాంగ్రెస్‌ మరో అడుగు

Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012

ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల్ని అతి కిరాతకంగా పాతరేయడంలో కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ వేదికైంది. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. సభానాయకుడి పేరు సీల్డ్‌కవర్లలో పంపే సంప్రదాయానికి మించి హైకమాండ్‌ ఈసారి రాష్ట్రంలో మరో అనధికార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అదే సమన్వయ కమిటీ. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం నెరపడానికంటూ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్రమంత్రి ఆజాద్‌ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. సిఎమ్‌, డిప్యూటీ సిఎమ్‌, పిసిసి అధ్యక్షుడు, ఒక ఎమ్‌పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఇందులో సభ్యులు. ప్రస్తుతం ఈ కమిటీయే రాష్ట్రంలో సూపర్‌పవర్‌గా చెలామణి అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఈ కమిటీ గాంధీభవన్‌లో సమీక్షిస్తోంది. ఏ పథకానికి నిధులెన్ని కేటాయించాలో ఇదే తేల్చి చెబుతోంది. ఆఖరికి ఏ కాంట్రాక్ట్‌ ఎవరికి ఖరారు చేయాలో.. ఇప్పటికే ఖరారైన కాంట్రాక్ట్‌ కొనసాగించాలో లేదో.. పూర్తయిన పనులకు బిల్లులు ఏమేరకు చెల్లించాలో కూడా ఈ కమిటీలోనేచర్చసాగుతోంది. రాజ్యాంగంమేరకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులెంచుకున్న సభా నాయకుడే పాలకుడు. అతని ఆధ్వర్యంలోనే మంత్రిమండలి ఏర్పడుతుంది. పార్టీ పెద్దల సూచనలు, సలహాల మేరకు పాలన సాగుతుంది. మేనిఫెస్టో ప్రకారం కార్యక్రమాలమలౌతాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడీ విధానం లేదు. ఇక్కడి పాలకులంతా సమన్వయ కమిటీ సమావేశాల కోసం ఎదురుచూస్తారు. ఆజాద్‌ ఎప్పుడొస్తారా అంటూ కాపుకాస్తారు. ఆయనొచ్చీ రావడంతోనే ఎమ్మెల్యేల నుంచి ఎమ్‌పిలు, మంత్రులు, కీలక నేతలంతా కలుసుకుంటారు. సభ్యులతో ఆయన గాంధీభవన్‌లో సమావేశాలు జరుపుతారు. వీటిలో ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్‌పై ఆరోపణలే ఉంటాయి. ఆజాద్‌ ముందు కిరణ్‌ను నిందితుడిగా నిలబెట్టి మిగిలిన సభ్యులంతా ఆయన పనివిధానాన్ని కడిగేస్తుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్ని విమర్శిస్తారు. ఆయన ఆమలు చేస్తున్నపథకాల్ని తప్పుబడతారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి బదులిచ్చుకోవాల్సుంటుంది. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తున్న ఒక ప్రజాప్రతినిధిని పార్టీపరంగా పార్టీ కార్యాలయంలో నిలదీసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, చెల్లింపులు, నిర్ణయాలపై కడిగిపారేసే విధానం ప్రజాస్వామ్యానికే కళంకం. అదీ రాష్ట్రంతో ఏ విధంగానూ సంబంధంలేని వ్యక్తులు పార్టీ హోదాలో ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కించపర్చడమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమన్వయకమిటీ రాజ్యాంగేతర శక్తిగా మారి రాష్ట్ర పాలన మొత్తం తన భుజానవేసుకుందన్న విమర్శలిప్పటికే వెల్లువెత్తుతున్నాయి. పాలన సజావుగా సాగేందుకు రాజ్యాంగ రచయితలే అనేక నిబంధనలు పెట్టారు. ప్రతి అధికారానికి ఎక్కడోచోట నియంత్రణ కల్పించారు. ప్రతి వ్యక్తిని కట్టడి చేసేందుకు చట్టాల్ని నిర్దేశించారు. ఇందులో భాగంగానే గవర్నర్‌ వ్యవస్థను రూపొందించారు. కానీ ఇప్పటికే ఇది భ్రష్టుపట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాల్లో గవర్నర్లను నియమిస్తోంది. ఇందుకు వారి రాజ్యాంగ అర్హతలకంటే పార్టీ పట్ల వారికున్న విధేయతనే పరిగణనలోకి తీసుకుంటోంది. వీరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులపై సూపర్‌పవర్‌లుగా చలామణి అవుతున్నారు. రోజువారి ప్రభుత్వ కార్యక్రమాల్ని పర్యవేక్షించడంతోపాటు వాటిపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక ఇస్తున్నారు. తద్వారా రాష్ట్రాల పాలనలో కేంద్రం తరచు జోక్యం చేసుకుంటోంది. పరోక్షంగా తన పెత్తనాన్ని సాగిస్తోంది. ఇది ఫెడరల్‌ రాజ్యాంగ విధానానికి విరుద్ధమంటూ మేథావులు ఘోషిస్తున్నా కేంద్రంలోని ఏ పార్టీ పట్టించుకోవడంలేదు. తామధికారంలోకొస్తే తమకూ ఇది లాభిస్తుందన్న దురాశ ప్రతిపక్షాల్లోనూ వ్యక్తమౌతోంది. అందుకే ఎన్‌టిఆర్‌ లాంటి కొందరు గవర్నర్‌ వ్యవస్థ రద్దుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక పాలనాబాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు నేరుగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటున్నారు. కేంద్ర ఆలోచనలు, నిర్ణయాల్ని వీరు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటోంది. కేంద్రం చేతుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్నిరకాల అధికారాలున్నా కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసి సమన్వయకమిటీ అంటూ సొంత పార్టీ పాలకులకు కూడా చెక్‌ పెట్టింది. తాను వారిని కూడా విశ్వసించనని సంకేతాలిచ్చింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికే జిల్లాల్లో డిఆర్‌సిలంటూ కొత్త విధానాన్ని అమలుచేస్తోంది. జిల్లాతో సంబంధం లేని కేబినెట్‌ సభ్యుల్ని డిఆర్‌సిలకు చైర్మన్‌లుగా నియమించింది. జిల్లాలో చేపట్టాల్సిన పనులన్నీ డిఆర్‌సిలే నిర్ణయిస్తున్నాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న ఇన్‌చార్జి మంత్రికి ఆ జిల్లా రాజకీయ, సామాజిక, భౌగోళిక, నైసర్గిక స్వరూపాల్తో ఎలాంటి పరిచయం లేకపోయినా అన్ని శాఖలపైనా సమీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆయన ద్వారానే అమలౌతున్నాయి. ఆఖరకు ఇళ్ళ కేటాయింపులో ఎమ్మెల్యేకు సగం, ఇన్‌చార్జి మంత్రికి మరోసగం ఇస్తున్నారు. ఇలా జిల్లాలో అమలయ్యే పథకాలన్నింటిలో సగం ఇన్‌చార్జిమంత్రి విచక్షణ మేరకే కేటాయించేవిధంగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇది ప్రతిపక్ష పార్టీల్ని కట్టడి చేసేందుకేనని ఆనాడు విపక్షాలన్నీ ఊదరగొట్టాయి. కానీ తమకు ప్రతిపక్షం, స్వపక్షం తేడా లేదని, ఎవరిపైనైనా పరాయి వ్యక్తులతో నియంత్రణ పెట్టడం తన నైజమంటూ సమన్వయ కమిటీ ఏర్పాటుతో కాంగ్రెస్‌ చాటిచెబుతోంది.
Share this article :

0 comments: