సీబీఐపై మరో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలి: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐపై మరో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలి: కొణతాల

సీబీఐపై మరో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలి: కొణతాల

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012

కేంద్రంలోని అధికార పార్టీకి తొత్తుగా మారి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి వంత పాడుతున్న సీబీఐపై మరో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ సాధనంగా మారిపోయిందనడానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యమన్నారు. మార్గదర్శి చిట్స్‌పై దర్యాప్తును గాలికొదిలేసి, ఎమ్మార్ దర్యాప్తులో.. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన చంద్రబాబు జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందులు పెట్టాలన్న లక్ష్యంతోనే సీబీఐ పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. 

ఆయన గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సీబీఐకి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఫ్రంట్ ఆఫీసుల్లా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆ పత్రికల్లో వచ్చిన వార్తలకు తగ్గట్టుగానే ఎటువంటి ఆధారాలు లేకుండా సీబీఐ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తుండడం చూస్తుంటే సీబీఐకి ఎజెండా ఎవరు ఖరారు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. సీబీఐ ఇంటరాగేషన్‌లో ఎవరు ఏం చెప్పారో పూసగుచ్చినట్లు ఆ రెండు పత్రికల్లో రావడం ఈ అనుమానాలను బలపరుస్తోందన్నారు. ఎమ్మార్‌పై విచారణ సందర్భంగా కోనేరు ప్రసాద్ తాను అన్ని పార్టీలకు చందాలిచ్చానని చెబితే ఆ దిశగా సీబీఐ ఎందుకు ఆయా పార్టీల నేతలను విచారించలేదని ఆయన ప్రశ్నించారు. ఓఎంసీలో కాప్టివ్ మైన్స్ అన్న పదమే కుంభకోణానికి కేంద్ర బిందువైతే, ఎమ్మార్‌లో చంద్రబాబు రెండో జీవో ద్వారా ఇచ్చిన కొలాబరేషన్ క్లాజ్ కుంభకోణానికి కారణమని తెలిసినా ఇప్పటివరకూ ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదో సీబీఐ చెప్పాలని డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: