మేలో మున్సిపల్ ఎన్నికలు.ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేలో మున్సిపల్ ఎన్నికలు.ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు

మేలో మున్సిపల్ ఎన్నికలు.ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

కొత్త, పాత మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మే చివర్లో పోలింగ్ నిర్వహించేలా కార్యక్రమం రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని, అయితే జూన్ వరకు గడువు ఇవ్వాలని అధికారులు కోరారని వివరించారు. అయితే రెండుమూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందన్న ఉద్దేశంతో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పురపాలక శాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు, 148 మున్సిపాలిటీలు ఉంటే.. వాటిలో నాలుగైదు మినహా అన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో వెంటనే బీసీ ఓటర్ల జాబితాలతోపాటు, వార్డుల విభజన చేపట్టాలని, అలాగే పంచాయతీల విలీనంతో విస్తీర్ణం పెరిగిన మున్సిపాలిటీల్లో పునర్వ్యవస్థీకరణ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. భయంతో ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కొత్త మున్సిపాలిటీలకు సిబ్బంది కేటాయింపు ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉందని అధికారులు భేటీలో ప్రస్తావించగా.. మూడ్రోజుల్లో ఫైలు క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు.

నిధులపై ఆంక్షలు ఎత్తివేత: మున్సిపాలిటీల నిధులపై ఉన్న ఆంక్షలు తొలగించాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారని మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకి కాకుండా అవసరమైన మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 

గోదావరి, కృష్ణా మూడో దశ ఒకేసారి: హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్లతోపాటు కృష్ణా మూడోదశ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. హడ్కో నిధులతో కృష్ణా మూడో దశ చేపట్టాలని నిర్ణయించారు. 
 ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు:
అనుకూలురునే సభ్యులుగా చేర్చించాలని సీఎం సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికలను తప్పించుకోవడం అనివార్యమైన నేపథ్యంలో తొలుత సహకార సంఘాల ఎన్నికలకే వెళ్లాలని అధికార పార్టీ నిర్ణయించింది. స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే సహకార ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు కలిగే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23లోగా ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్), మే 15లోపు జిల్లా సహకార సంఘాల (డీసీసీబీ) ఎన్నికలు నిర్వహించాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెస్)ల అధ్యక్షులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ఎస్.శైలజానాథ్ సమావేశమయ్యారు. 

ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుంచారు. అయితే మెజారిటీ డీసీసీబీ చైర్మన్లు ఈ ప్రతిపాదనపట్ల విముఖత వ్యక్తం చేశారు. మద్దతు ధర, ఎరువుల ధర పెంపు, కరెంటు కోతలతో రైతులు ప్రభుత్వంపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభావం అధికంగా ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయడమే ఉత్తమమని సూచించారు. అయితే ఏప్రిల్, మే నెలలో ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చామని ఈ సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్‌లు స్పష్టంచేశారు. 

కొత్త ఓటర్లను చేర్పించండి: నోటిఫికేషన్‌కు 45 రోజుల ముందు సంఘంలో సభ్యులుగా చేరిన వారంతా ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులైనందున తక్షణమే సహకార సంఘ సభ్యత ప్రక్రియను ప్రారంభించి, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే వారినే సభ్యులుగా చేర్పించాలని సీఎం సూచించారు. అయితే కొత్తగా సభ్యత్వ నమోదుతో విమర్శలతోపాటు, స్థానికంగా సమస్యలు వస్తాయని డీసీసీబీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో డీసీసీబీ ఛైర్మన్లు శనివారం సమావేశమై తరువాత సీఎంను కలిసి అభిప్రాయాన్ని తెలియ చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆప్కాబ్ ఛైర్మన్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 డీసీసీబీ ఛైర్మన్లలో 20 మంది కాంగ్రెస్ వారేనని తెలిపారు. 


Share this article :

0 comments: