వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

* 30న హాజరుకావాలని శోభానాగిరెడ్డికి స్పీకర్ నోటీసులు
* ఫిబ్రవరి 2న రావాలని కాపు రామచంద్రారెడ్డికి సూచన
* త్వరలోనే మిగతా శాసనసభ్యులకూ
* తాము రాబోమని, చర్యలు తీసుకోవచ్చని ఇప్పటికే తేల్చి చెప్పిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో విప్ ఉల్లంఘించిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదుకు సంబంధించి విచారణ ప్రక్రియకు ఇప్పట్లో తెరపడేట్లు లేదు. రెండో విడత నోటీసులిచ్చినా హాజరుకాని ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయిం చారు. స్పీకర్ సమక్షంలోనే విప్ ఉల్లంఘించామని, చర్యలు తీసుకోవచ్చని, ఇప్పటికే ఆ విషయం తాము చెప్పినందున విచారణకు హాజరుకాబోమని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ విచారణ మరికొంతకాలం తప్పదని అసెంబ్లీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

శనివారంతో ముగిసిన గడువు..
ఈ నెల 18 నుంచి 21 వరకు వేర్వేరుగా స్పీకర్ కోర్టుముందు హాజరుకావాలని శాసనసభాపతి ఇటీవల 16 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేకు రెండో విడత నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో ఆ విచారణ గడువు ముగిసింది. తాము కోర్టుకు వచ్చేది లేదని, చర్యలు తీసుకోవచ్చని ఆ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ విషయంలో చట్టంలో, రాజ్యాంగంలో ఉన్న నిబంధనల మేరకే నడవాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పిలుపు మేరకు పీఆర్పీ విప్ వంగా గీత స్పీకర్‌ను కలిసి లిఖిత పూర్వకంగా మరో ఫిర్యాదును అందించారు. 

శనివారంతో గడువు ముగిసిన తరుణంలో స్పీకర్ మరోసారి ఆయా ఎమ్మెల్యేలు విచారణకు రావాలంటూ మళ్లీ నోటీసులు జారీచేశారు. ఈ నెల 30న పీఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిని తన ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే ఫిబ్రవరి రెండున కోర్టుముందుకు రావాలని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని ఆదేశించారు. ఆ రోజున విప్ కొండ్రు మురళి కూడా స్పీకర్ కోర్టుకు రావాలని సూచించారు. మిగతా ఎమ్మెల్యేలకు కూడా మరోసారి నోటీసులు ఇచ్చి వారు కోర్టుకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: