సునీల్ రెడ్డి అరెస్టు వెనుక ఓ నాటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సునీల్ రెడ్డి అరెస్టు వెనుక ఓ నాటకం

సునీల్ రెడ్డి అరెస్టు వెనుక ఓ నాటకం

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

సునీల్ రెడ్డి అరెస్టు వెనుక ఓ నాటకం ఉంద నీ ఆయన ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని దోషిగా చూపే కుట్ర జరుగుతోందని పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్థన్ ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనీ తాను టార్గెట్ చేసిన వ్యక్తులను కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్టైలిష్ హోమ్స్‌కు చెందిన రంగారావును కావాలనే అరెస్టు చేయకుండా సీబీఐ వదలి వేసిందనీ పైగా ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకునేలా సహకరించిందనీ బాజిరెడ్డి దుయ్యబట్టారు. 

రంగారావు చేత సునీల్‌పై ఆరోపణలు చేయించి అతనిని అరెస్టు చేశారనీ సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ తీరు కూడా అభ్యంతరకరంగా ఉందనీ ఆయన అన్నారు. నిజాయితీపరుడిగా చెప్పుకుంటున్న లక్ష్మీనారాయణ సునీల్ విషయంలో తప్పులో కాలేశారనీ ఆయన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనీ బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో రంగారావును వదలి వేసి సునీల్‌ను బలిపశువును చేయడానికే అరెస్టు చేశారని ఆయన అన్నారు. సునీల్ ద్వారా జగన్‌ను కూడా అరెస్టు చేయాలనే పన్నాగం కూడా ఇందులో ఉందని ఆయన అన్నారు. 

జగన్‌పై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేస్తున్న విమర్శలను ప్రస్తావించినపుడు వారంతా తోడు దొంగలని ఆయన వ్యాఖ్యానించారు. వీరందరి ఉమ్మడి ఎజెండా జగన్‌ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణగదొక్కాలనేదేనని బాజిరెడ్డి మండి పడ్డారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారనే వ్యాఖ్యలకు తమ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
Share this article :

0 comments: