'సాక్షి' కేసుపై తీర్పు 14కు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సాక్షి' కేసుపై తీర్పు 14కు వాయిదా

'సాక్షి' కేసుపై తీర్పు 14కు వాయిదా

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

సాక్షి మీడియా గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాలను సిబిఐ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసి పిటిషన్ పై నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పుని ఈ నెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

దేశంలో సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కూడా సిబిఐ బ్యాంకు ఖాతాలను నిలిపివేయలేదని సాక్షి మీడియా తరపున వాదనలు వినిపించారు. ఈ కేసు విషయంలో సిబిఐ ఉద్దేశపూర్వకంగా ఖాతాలను నిలిపివేసిందని తెలిపారు. 
సరైన కారణం చూపకుండా ఖాతాలను నిలిపివేశారన్నారు. జగతి పబ్లికేషన్ అనేది వ్యక్తిగత సంస్థ కాదని, ఇందులో అనేక మంది షేర్ హోల్డర్స్ ఉన్నారని కోర్టుకు వివరించారు. ఇందిరా టెలివిజన్ పై ఎటువంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారని తెలిపారు. ఈ సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన కారణంగా వేలాది ఉద్యోగులు ఇబ్బందులు పడవలసి ఉంటుందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఇది పరువుకు నష్టం కలిగే అంశం అని కూడా తెలిపారు. 
వాదనలు ముగిసిన తరువాత తీర్పుని ఈ నెల 14కి కోర్టు వాయిదా వేసింది.
Share this article :

0 comments: