విశ్వసనీయతకు పట్టం కట్టండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయతకు పట్టం కట్టండి

విశ్వసనీయతకు పట్టం కట్టండి

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఉప ఎన్నికల్లో విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. బొమ్మనహాళ్ మండలంలోని గోనేహాళ్, శ్రీధరఘట్ట, ఉద్దేహాళ్, ఉంతకల్లు, బొమ్మనహాళ్‌లో జరిగిన రోడ్‌షోలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలను తీసుకురావడం కోసం ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ‘‘నేడు ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తారు. పేదలు, రైత న్నల కోసమైతే ఇంకా బాధపడతారు. మరింత ఎక్కువ ఆలోచిస్తారు. 

అయితే... అవిశ్వాస తీర్మానంలో పదవులు కోల్పోయిన 17 మంది ఆ కోవకు చెందరు. రైతన్నలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి పదవులను కోల్పోయారు. వారికి మరోసారి సెల్యూట్ చేస్తున్నా. వారిలో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. నిజాయితీగా నిలబడి పదవిని త్యాగం చేసిన రామచంద్రన్నను గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో పదవులు వస్తాయి... పోతాయని, విశ్వసనీయతే ముఖ్యమని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతున్నా చాలా మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏ మాత్రమూ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేడు రైతన్నలు కన్నీరు పెడుతున్నారు.

వ్యవసాయం కన్నా ఉరి వేసుకోవడం మేలనే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితుల్లోనూ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు... నా అక్కనో, చెల్లినో కాదు కదా అన్న రీతిలో ఉన్నారు. ఉపాధి కింద కనీస కూలి రూ.137 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా రూ.70 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని అక్కా చెల్లెళ్లు చెబుతున్నప్పుడు బాధ కలుగుతోంద’ని అన్నారు. పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీరింగో.. మెడిసినో చేయాలనే ఉద్దేశంతో మహానేత దివంగతవైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 

నేడు రీయింబర్స్‌మెంట్ వస్తుందో, లేదోనన్న అపనమ్మకాన్ని ప్రభుత్వం విద్యార్థుల్లో కలిగించిందన్నారు. పేదలకు సంజీవని లాంటి 108, ఆరోగ్యశ్రీ పథకాల తీరు కూడా ఇదే విధంగా ఉందని విమర్శించారు. సగం 108 వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయన్నారు. ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో కుళ్లు, కుతంత్రాల రాజకీయం సాగుతోందని దుయ్యబట్టారు. ఢిల్లీ నుంచి కంట్రోల్ చేస్తున్న పెద్దలకు అర్థమయ్యేలా ఉప ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 12న జరిగే మినీ సంగ్రామంలో రాష్ట్రంలోని 18 చోట్ల ఇచ్చే తీర్పు విశ్వసనీయతకు, విలువలకు నాంది కావాలని కోరారు.
Share this article :

0 comments: