నిబంధనలు పాటిస్తే దోషి... అతిక్రమిస్తే గవర్నరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిబంధనలు పాటిస్తే దోషి... అతిక్రమిస్తే గవర్నరా?

నిబంధనలు పాటిస్తే దోషి... అతిక్రమిస్తే గవర్నరా?

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

మల్యాల/ కరీంనగర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిబంధనలు పాటించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని దోషిగా చూపిస్తూ... నిబంధనలు అతిక్రమించిన రోశయ్యకు గవర్నర్ పదవి కట్టబెడతారా? అని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను విమర్శించారు. ఆయన గురువారం కరీంనగర్‌లో ‘న్యూస్‌లైన్’తోనూ, మల్యాల మండలం కొండగట్టులో కాంగ్రెస్ కార్యకర్తలతోనూ మాట్లాడారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు రాయితీలు కల్పించడం జాతీయ విధానమని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ శాఖల, మంత్రుల సూచనల మేరకు వైఎస్ నిర్ణయాలు తీసుకుంటే వాటిపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

అమీర్‌పేటలో రూ.400 కోట్ల విలువ చేసే భూములను తిరిగి అప్పగించే వీలులేదని మున్సిపల్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యతిరేకించినా, నిబంధనలు అతిక్రమించి కట్టబెట్టిన రోశయ్యకు మాత్రం గవర్నర్ పదవి ఇచ్చారని ఆక్షేపించారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులో అధికారులు, మంత్రుల పాత్రపై సుప్రీంకోర్టులో ఉన్న కేసులకు ప్రభుత్వం న్యాయవాదిని నియామకం చేసినప్పుడు... మంత్రివర్గ సూచనల మేరకు పరిశ్రమలకు భూములు కేటాయించిన వైఎస్‌ను నేరస్తునిగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. 

2014లో జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. సీబీఐ విచారణలో జగన్ గతంలో తెలిపిన వివరాలే తప్ప కొత్తగా కనుగొన్నదేమీలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీ అకౌంట్లు నిలిపివేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం హేయమైన చర్యని విమర్శించారు. 
Share this article :

0 comments: