రైతు నేతల్ని అవమానించిన సీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు నేతల్ని అవమానించిన సీఎం

రైతు నేతల్ని అవమానించిన సీఎం

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

క్యాంపు కార్యాలయం ఎదుట నేతల ధర్నా
సీఎం సీటులో కిరణ్ ఉండేది 40 రోజులే
ఆ తర్వాత క్రి కెట్ చూస్తూ గడపాల్సిందే
ఏపీ రైతు సంఘం నేత రామకృష్ణ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోయేకాలం దాపురించిందని, ముఖ్యమంత్రి పీఠంపై మరో 40 రోజులకు మించి ఆయన కూర్చునే అవకాశంలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ నేత కె.రామకృష్ణ మండిపడ్డారు. రైతు నేతల్ని రమ్మని పిలిచి ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు హడావుడి పడిన సీఎం.. రైతు సమస్యల్ని వినేందుకు ఐదు నిమిషాల సమయం కేటాయించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. అన్నదాతలను విస్మరించిన వారెవ్వరికీ పుట్టగతులు లేని సంగతిని సీఎం గుర్తించాలన్నారు. 

గురువారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. అయితే అపాయింట్‌మెంట్ లేదని భద్రతా సిబ్బంది నిరాకరించడంతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఇంకా 40 రోజుల తర్వాత ఈ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టుకుని బ్యాలే డాన్సులు, క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ కాలం గడపాల్సిందేనని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సమయమిచ్చారని పోలీసులు చెప్పిన తర్వాతే తాము క్యాంపు కార్యాలయానికి వెళ్లామని, తీరా అక్కడకు వెళ్లిన తర్వాత సమయం లేదని చెప్పడంతో అక్కడ బైఠాయించిన తమను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారన్నారు. రైతు సమస్యల్ని వినే తీరిక లేని ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో తిరుగుతూ రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: