‘‘సార్! నేను రిటైర్డ్ ఉద్యోగిని. రైల్వేలో పనిచేసి రిటైరయ్యా. నెలనెలా పెన్షన్ వస్తోంది.నా పెన్షనంతా ఇచ్చేస్తా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘‘సార్! నేను రిటైర్డ్ ఉద్యోగిని. రైల్వేలో పనిచేసి రిటైరయ్యా. నెలనెలా పెన్షన్ వస్తోంది.నా పెన్షనంతా ఇచ్చేస్తా!

‘‘సార్! నేను రిటైర్డ్ ఉద్యోగిని. రైల్వేలో పనిచేసి రిటైరయ్యా. నెలనెలా పెన్షన్ వస్తోంది.నా పెన్షనంతా ఇచ్చేస్తా!

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

 ‘‘సార్! నేను రిటైర్డ్ ఉద్యోగిని. రైల్వేలో పనిచేసి రిటైరయ్యా. నెలనెలా పెన్షన్ వస్తోంది. రోజూ ‘సాక్షి’ చదువుతా. సీబీఐ దాని ఖాతాల్ని స్తంభింపజేయటం చాలా ఘోరం. నా ఉద్దేశం ఒక్కటే. ‘సాక్షి’ ఆగకూడదు. కావాలంటే నా పెన్షన్ డబ్బుల్లో నెలనెలా సగానికిపైగా పత్రికకిచ్చేస్తా. ఇంకా అవసరమైతే మొత్తం పెన్షన్ ఇచ్చేస్తా. కానీ ‘సాక్షి’ రావాలి. ఇలాంటి చర్యల ద్వారా ‘సాక్షి’ని ఏమీ చేయలేరని వాళ్లు తెలుసుకోవాలి. నాలాంటి కోట్ల మంది ‘సాక్షి’కి అండగా ఉన్నారని తెలిసిరావాలి’’ ఇదీ... భీమవరానికి చెందిన నల్లజర్ల నాగేశ్వరరావు ఉద్వేగం. బుధవారం ఉదయాన్నే ఆయన ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్‌చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలోని కోట్లాది మందికి ఆరాధ్యుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని గద్గదస్వరంతో మాట్లాడారు. నాగేశ్వరరావు ఒక్కరే కాదు... బుధవారం ఉదయం నుంచీ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మంది ‘సాక్షి’ కార్యాలయాలకు ఫోన్లు చేశారు. కొందరు ‘సాక్షి’ పత్రిక, ఛానెల్ కార్యాలయాలకు ఫోన్లు చేయగా... మరికొందరు నేరుగా ఆయా సంస్థల్లో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేశారు. ‘సాక్షి’కి ఆర్థికంగా అండగా ఉంటామని, ఇంకా అవసరమైతే చందాలు సేకరించి ‘సాక్షి’ని నిలబెట్టుకుంటామని ఉద్వేగపూరితంగా చెప్పారు. 

కొందరు ఎన్నారైలు సైతం ఫోన్లు చేసి... ‘‘కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవండి. దాన్ని తక్షణం ‘సాక్షి’ పేపర్లోను, ఛానెల్లోనూ ప్రచురించండి. మేం దాంట్లో డిపాజిట్లు చేస్తాం. మేమంతా సాక్షికి అండగా నిలుస్తాం’’ అని చెప్పారు. కొందరైతే గంటలోగా ఖాతా నెంబరును ‘సాక్షి’ ఛానెల్లో చూపించాల్సిందేనంటూ మొండి పట్టు పట్టారు కూడా. పలు జిల్లాల నుంచి ఫోన్లు చేసి, ఈ మెయిల్స్ పంపిన వ్యక్తులు సైతం... నెలనెలా ఎంతో కొంత ఇస్తామని, ‘సాక్షి’కి ఆర్థికంగా సహకరిస్తామని చెప్పగా... కొందరైతే తాము వైఎస్సార్ వల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని... ‘సాక్షి’లో ప్రతిఫలం లేకుండా పనిచేయటానికి సైతం సిద్ధమని చెప్పారు. అయితే ‘సాక్షి’ సిబ్బంది వారందరి వ్యాఖ్యలనూ సున్నితంగా తిరస్కరించారు. ‘మీరు మాపై చూపిస్తున్న అభిమానం చాలు. మాకు వెన్నంటి ఉంటామని చెబుతున్న మీ దీవెనలు చాలు. అంతకు మించి ఏమీ అక్కర్లేదు’ అని సర్దిచెప్పారు.
Share this article :

0 comments: