'పొలిటికల్ బాసుల చెప్పుచేతల్లో సిబిఐ' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పొలిటికల్ బాసుల చెప్పుచేతల్లో సిబిఐ'

'పొలిటికల్ బాసుల చెప్పుచేతల్లో సిబిఐ'

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012

న్యూఢిల్లీ: సాక్షిపై అణచివేత ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ ఎం.జె.అక్బర్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను సీబీఐ హరిస్తోందని విమర్శించారు. సాక్షిపై చర్య కేవలం ఆర్థికపరమైన నిర్ణయం కాదని, ఇందులో రాజకీయపరమైన ఆలోచన ఉందని ఆయన అన్నారు. స్వతంత్రంగా ఉండవలసిన సీబీఐ పొలిటికల్ బాసుల చెప్పుచేతల్లో నడుస్తోందన్నారు. 

మీడియా మెడలు వంచేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కనుకనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని చెప్పారు. సాక్షి రాస్తున్న వాస్తవాలను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్టు ఉందన్నారు. కాని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉంటాయని ఆయన గుర్తు చేశారు. చాలా ఏళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని మరిపోకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం, ఇది ఏక పార్టీ ప్రభుత్వంకాదని స్పష్టం చేశారు. న్యాయపోరాటంలో సాక్షికి తప్పనిసరిగా మంచి జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: