రాజకీయ కారణాలతోనే సాక్షిపై ఆంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ కారణాలతోనే సాక్షిపై ఆంక్షలు

రాజకీయ కారణాలతోనే సాక్షిపై ఆంక్షలు

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

సాక్షి పత్రిక, సాక్షి టీవీలకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా స్పష్టమవుతోందని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఏపీయూడబ్ల్యూజే)లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాక్షికి ప్రకటనలు ఆపేయాలని సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించేలా, ప్రభుత్వ వ్యతిరేక అంశాలు ప్రజలకు తెలియకుండా చేయడం కోసమే ఇలా చేస్తున్నట్లు ఉందని ఈ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరాయి. 

ఎన్నికల సమయంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా, 20 వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఇబ్బంది రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు కె.అమర్‌నాథ్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు డి.సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డిలు గురువారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని భన్వర్‌లాల్ చెప్పారు. 

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సాక్షి యాజమాన్యం కేసు విచారణలో భాగంగానే సీబీఐ ఖాతాలను స్తంభింపజేసిందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటనలు ఆపేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సందేహాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు సాధారణంగానే ప్రకటనలు ఇవ్వరని, మరి అలాంటప్పుడు సాక్షికి ప్రకటనలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పత్రిక ప్రచురణను, పంపిణీని, పాత్రికేయులు వార్తలు సేకరించే ప్రక్రియకు అడ్డంకులు కలిగించే ఎలాంటి చర్యలైనా తప్పేనని 1992లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 
Share this article :

0 comments: