మొట్టమొదటి వైద్యబృందం వైఎస్సార్‌సీపీదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొట్టమొదటి వైద్యబృందం వైఎస్సార్‌సీపీదే

మొట్టమొదటి వైద్యబృందం వైఎస్సార్‌సీపీదే

Written By news on Sunday, June 30, 2013 | 6/30/2013

- ఉత్తరాఖండ్‌లో పదిరోజుల పాటు తెలుగువారికి సేవలు
- పార్టీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: జలప్రళయంతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో పదిరోజుల పాటు దాదాపు 2,500 మందికి వైద్య సేవలు అందించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ వైద్య విభాగం వివరించింది. ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటి వైద్య బృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం కన్వీనర్ డా.గోసుల శివభారత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైద్యులు అశోక్ యాదుల, పురుషోత్తంరెడ్డి, నాగభూషణం, ఫణి, లక్ష్మీప్రసాద్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో తమకు ఎదురైన సంఘటనలను, అనుభవాలనూ ఆయన వివరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాల మేరకు 20 మంది వైద్య సిబ్బందితో ఈ నెల 19న ఉత్తరాఖండ్ వెళ్లి సహాయచర్యలు ప్రారంభించినట్లు శివభారత్‌రెడ్డి తెలిపారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలు ‘ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం’ అనే నినాదం స్ఫూర్తితో తాము పనిచేసినట్లు చెప్పారు. రుషికేష్, డెహ్రాడూన్, జోషిమఠ్ తదితర ప్రాంతాల్లో స్థానిక అధికారుల సహకారంతో ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లకు కూడా వెళ్లి వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. డెహ్రాడూన్ కలెక్టర్ పురుషోత్తం, సివిల్ ఏవియేషన్ అధికారి సీతయ్య తెలుగువారు కావడంతో తమకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించినట్లు చెప్పారు. తాము పదిరోజుల పాటు వైద్యసేవలు అందించినా ఇతరుల్లా ప్రచారం కోసం పాకులాడలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ వరద మృతులకు వైద్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
Share this article :

0 comments: