ఇది కాంగ్రెస్, టీడీపీల విష క్రీడే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది కాంగ్రెస్, టీడీపీల విష క్రీడే!

ఇది కాంగ్రెస్, టీడీపీల విష క్రీడే!

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

- రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
- ‘సాక్షి చైతన్యపథం’లో గుంటూరువాసుల ఆవేదన

సాక్షి, గుంటూరు: జనంతో మమేకమైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాస్వామ్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీలు రాజకీయ దురుద్దేశంతోనే సీబీఐని పావుగా వాడుకుని విష క్రీడలాడుతున్నాయని నగరానికి చెందిన పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జగన్ జైల్లో ఉంటేనే తాము గెలుస్తామన్న దౌర్భాగ్యస్థితికి కాంగ్రెస్, టీడీపీలు దిగజారడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమేనని వారు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని కావటి శంకరరావు కల్యాణమంటపంలో స్వప్న వ్యాఖ్యానంతో గురువారం జరిగిన ‘సాక్షి చైతన్య సదస్సు’లో వారు తమ మనోభావాలను వ్యక్తీకరించారు. ప్రముఖ న్యాయవాది మహ్మద్ సుల్తాన్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జగన్‌పై సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసుల్లో చార్జిషీట్లు వేసే విషయంలోనూ కోర్టులను మభ్య పెడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. 

భారత శిక్షా స్మృతి ప్రకారం నేరారోపణ ఎదుర్కొంటున్నవారిని నిర్దోషిగానే భావించాలని, చట్టప్రకారం వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదని ఉందన్నారు. జగన్ కేసు విషయంలో రాజకీయ ప్రోద్బలంతోనే క్విడ్ ప్రో అనే పదాన్ని వాడారని, బొగ్గు కుంభకోణంలో, దాల్మియా కంపెనీ వాటాల్లో ఇలాంటి పదాన్ని ఎక్కడా వాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జగన్ ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టుకు లేఖ రాసిన శంకర్రావుకే క్విడ్ ప్రో కో వర్తిస్తుందన్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీని వీడి బయటకు వచ్చిన నాయకులను కాంగ్రెస్ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు సీబీఐని పావుగా వాడుకుంటోందన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ, జగన్ కేసులో సీబీఐ తన పనితీరు వల్ల ఎంతో అప్రతిష్ట, అపప్రధ మూటకట్టుకున్నట్లు తెలిపారు. జగన్ కేసు విషయంలో సీబీఐ వారు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కే ఆలోచనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రజాదరణలో మునిగిపోయిన జగన్‌పై సీబీఐ బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కావాలని పనిగట్టుకుని కోర్టులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జగన్ బయటకు వస్తే విచారణ చేయలేమని సీబీఐ చెప్పడం దౌర్భాగ్యమని, జగన్ జైల్లో ఉంటేనే గెలుస్తామనుకోవడం కాంగ్రెస్, టీడీపీల దుర్నీతిని తెలియజేస్తోందన్నారు. లంబాడీ హక్కుల సంఘం నాయకులు ఎన్.కృష్ణనాయక్ మాట్లాడుతూ, బోఫోర్స్ కేసులో రాజీవ్ మరణాంతరం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో తొల గించి వై.ఎస్. మరణాంతరం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలు ఆంధ్రుల ఆత్మాభిమానంపై జరుగుతున్న కుట్రలుగా సమావేశంలో పాల్గొన్న పలువురు అభివర్ణించారు.
Share this article :

0 comments: