వైఎస్సార్ సీపీలోకి టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

సాక్షి, హైదరాబాద్: గుంటూరు, మెదక్ జిల్లాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు చెందిన మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు ఇతర నేతలు పెద్దసంఖ్యలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

గుంటూరు జిల్లా నుంచి పార్టీలో చేరిన వారిలో జిల్లా జెడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు శాఖమూరి నారాయణ ప్రసాద్, దాచేపల్లి మాజీ జెడ్పీటీసీ చెన్నయ్య, ఆదర్శ సర్పంచ్‌గా జాతీయస్థాయిలో ఎంపికైన మాణిక్యమ్మ ఉన్నారు. తాడికొండ, తెనాలి, మాచర్ల, మంగళగిరి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాగ మల్లేశ్వరరావు, బొల్లిముంత వీరయ్య, వాసిరెడ్డి వెంకట్రావు,వంగా నాగిరెడ్డి, దాసరి శ్రీనివాసరావు, మేకపోతుల సాంబశివరావు, పి.సుమన్, బి.వసంత్‌రెడ్డిలతో పాటు దాదాపు రెండు వందల మంది పార్టీలో చేరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మెదక్ నుంచి..: బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రామాగౌడ్, టీడీపీ నేత, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ మహమూద్, కాంగ్రెస్‌నేత, సంగారెడ్డి మండలం కాశీపూర్ మాజీ ఎంపీటీసీ సర్దార్, టీఆర్‌ఎస్ నేతలు, మాజీ సర్పంచ్‌లు మోన్యా నాయక్, వి.జయరాం, సీనియర్ సిటిజన్స్ మెదక్ జిల్లా అధ్యక్షుడు వి.కనకరాజు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి వెంట పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు, మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి తదితరులున్నారు.
Share this article :

0 comments: