సోనియా డీఎన్‌ఏ ఏమిటో దిగ్విజయ్ చెప్పాలి: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా డీఎన్‌ఏ ఏమిటో దిగ్విజయ్ చెప్పాలి: గోనె

సోనియా డీఎన్‌ఏ ఏమిటో దిగ్విజయ్ చెప్పాలి: గోనె

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

 రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ డీఎన్ ఏ ఏంటో దిగ్విజయ్ సింగ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీని వీడి ఆ పార్టీనీ మట్టి కరిపించి....దేశ ప్రధానులు అయిన నేతలున్నారని గోనె అన్నారు. 
వారెవ్వరూ మళ్లీ కాంగ్రెస్ లోకి తిరిగి రాలేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని గోనె పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్ 

కాంగ్రెస్ పార్టీదే హవా అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లోనూ ఇదే అంశం వెల్లడైందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై సీట్లు, ఓట్ల విషయంలో కాంగ్రెస్ లెక్కలు ఫలించవన్నారు. ఇక గతంలో జార్ఖండ్ ను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ గెలువలేకపోయిందని గోనె వ్యాఖ్యనించారు.
Share this article :

0 comments: