జగన్‌కు ‘పంచాయతీ’ బహుమతి : వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు ‘పంచాయతీ’ బహుమతి : వైఎస్ విజయమ్మ

జగన్‌కు ‘పంచాయతీ’ బహుమతి : వైఎస్ విజయమ్మ

Written By news on Monday, July 1, 2013 | 7/01/2013

- కరీంనగర్ సదస్సులో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
- ప్రతి పంచాయతీనీ మన పార్టీయే గెలవాలి
- సామాన్యుడు బతికే పరిస్థితి లేదు
- కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటేయరు
- కుట్రలు, కుతంత్రాలే చంద్రబాబు జీవితం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలూ ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఏ వర్గమూ ఆ పార్టీకి ఓటువేసే పరిస్థితి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కు కుట్రలతో ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూల పరిస్థితి ఉంది. ప్రతి గ్రామపంచాయతీపైనా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలి’అని సూచించారు.

పంచాయతీ ఎన్నికల విజ యాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, అందుకోసం పార్టీశ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను స్థానికఎన్నికలను సమాయత్తం చేసేలక్ష్యంతో కరీంనగర్‌లోని వరలక్ష్మి గార్డెన్‌లో ఆదివారం పార్టీ జిల్లా సదస్సు జరిగింది. ముందు తెలంగాణ అమరవీరులకు, మహానేత వైఎస్సార్ మృతిని తట్టులేక మరణించిన వారికి, ఉత్తరాఖండ్ వరదల మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటానికి నివాళుల ర్పించిన అనంతరం విజయమ్మ ప్రసంగించారు. 

భయంతోనే సర్కారు అడ్డదారులు
ఎప్పుడైనా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజయమ్మ గుర్తుచేశారు. కానీ అలాచేస్తే ఓడిపోతామనే భయంతో ముందుగా పార్టీ ప్రమేయంలేని గ్రామ పంచాయ తీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. ‘మొన్నటి సహకార ఎన్నికల్లో మాదిరిగానే గెలిచిన వారిని తమవారిగా చెప్పుకుని, విజయం సాధించామని ప్రచారం చేసుకోజూస్తోంది. ఆ ఎన్నికల్లోలాగే అన్నిరకాల అడ్డదారులూ తొక్కేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై మన పార్టీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ప్రజల ఆశీస్సులతో పార్టీని గెలిపించుకుందాం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్, డిసెంబర్‌లలో వచ్చే అవకాశముంది. వైఎస్సార్ స్వర్ణయుగంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను, మన పార్టీ ప్లీనరీలో జగన్ చెప్పిన అంశాలను గడపగడపకూ తీసుకెళ్లండి. ప్రజల్లో మనకు ఆదరణ ఉంది. అలసత్వం వద్దు. కష్టపడాలి. ప్రతి గ్రామ పంచాయతీనీ గెలవాలి’ అని చెప్పారు. ప్రభుత్వ తీరు ‘మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు’ చందంగా ఉంది. వైఎస్సార్ ఎప్పుడూ పేదలకోసం ఆలోచిం చేవారు. తెలంగాణవాదాన్ని గౌరవిస్తూనే, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్లేవారు. తెలంగాణపై నిర్ణయం మనచేతుల్లో లేదు. ప్లీనరీలోనూ జగన్ ఇదే చెప్పారు. వైఎస్ ఉంటే ఇప్పటికే జలయజ్ఞం పూర్తయ్యేది. తెలంగాణరైతులకు భరోసా కల్పించేప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిచేసేవారు’ అన్నారు.

ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేదు
మన రాష్ట్రంలో మాదిరిగా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం చేతులు కలిపిన చరిత్ర మరెక్కడా లేదని విజయమ్మ గుర్తు చేశారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, చీకటి ఒప్పందాలేనన్నారు. ‘ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానంటూ టీడీపీ ఆవిర్భావ సమయంలో ప్రకటించి, ఆ పార్టీ గెలవగానే మామ పంచన చేరాడు. పదవి కోసం మామనే వెన్నుపోటు పొడిచాడు. తనపై ఆరోపణలతో చార్జీషీటు వేసిన బీజేపీతోనే 1999లో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తానంటూ ప్రజలను మోసగించాలని చూస్తున్నాడు. 

అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపి, జగన్‌ను జైలునుంచి బయటికి రాకుండా చేస్తున్నాడు. మైనారిటీ సర్కారును కాపాడుతూ, తద్వారా కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాబుకు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదు. ధైర్యముంటే ఆయన తొమ్మిదేళ్ల పాలనను మేనిఫెస్టోగా పెట్టి ఎన్నికలకు వెళ్లగలడా?’ అని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధు అధ్యక్షతన జరిగిన సదస్సులో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు ఎన్.సూర్యప్రకాశ్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిశీలకురాలు పి.విజయారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, రామగుండం, హుజూరాబాద్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, రాజ్‌ఠాకూర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. 

మా ఇంట్లోని పిల్లలనూ వదలరేమో!
కొందరు మంత్రులు, అధికార పార్టీ నేతలు జగన్ పై, తమ కుటుంబంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సదస్సులో విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వెన్నుపోటుదారులో ప్రజలకు తెలుసని మంత్రి రఘువీరారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నా కుమారుడు ఏం తప్పు చేశాడు? ఎందుకు వెలేయాలి? వైఎస్ హయాంలో జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వచ్చాడా? ఏదైనా పని కోసం ఎవరినైనా అడిగాడా? చరిత్రలో ఏ ఒక్కరికీ ఇంత అన్యాయం జరగలేదు. దివంగత నేతపై, జగన్‌పై, షర్మిలపై, భారతిపై, నాపై, చివరికి నా మతంపై, నా బొట్టుపై కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఇక వారు మాట్లాడటానికి మా ఇంట్లో చిన్న పిల్లలు మాత్రమే మిగిలారు. చంద్రబాబు అన్నట్టు మాకు లక్ష కోట్ల ఆస్తులు లేవు గానీ.. మీ అభిమానమే మాకు లక్ష కోట్లు. మాకున్న ఆస్తుల కన్నా మీ అభిమానమే గొప్పది. మీ ప్రేమ, అభిమానాల వల్లే మీ ముందుకు వస్తున్నా. దేవుడున్నాడు. దేవుని దయతో జగన్‌నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ స్వర్ణయుగం వస్తుంది..’ అని అన్నారు.
Share this article :

0 comments: