అండగా ఉంటాం.. సత్తా చూపండి : వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అండగా ఉంటాం.. సత్తా చూపండి : వైఎస్ విజయమ్మ

అండగా ఉంటాం.. సత్తా చూపండి : వైఎస్ విజయమ్మ

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

 నిజామాబాద్ జిల్లా సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు విజయమ్మ దిశా నిర్దేశం





సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కార్యకర్తల కష్టసుఖాల్లో వైఎస్ కుటుంబం తోడుగా ఉంటుందని, గ్రామాలు, పట్టణాల్లో పార్టీ నాయకత్వ పటిషతకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. నిజామాబాద్ నగరంలోని లక్ష్మీకల్యాణ మంటపంలో మంగళవారం జరిగిన జిల్లాపార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా జగన్ నిర్దోషిత్వాన్ని నిరూపిద్దామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రానున్న ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తాయని, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఎదుర్కోవాలని సూచించారు. తెలంగాణ ,రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై వైఎస్ మక్కువ చూపారని విజయమ్మ తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లతో పాటు ఎనిమిది ప్రాజెక్టులకు జాతీయ హోదాను కల్పించడం ద్వారా సత్వరమే పూర్తి చేయాలని భావించారని అన్నారు. 

వరి మద్దతుధరను రూ.60 మాత్రమే పెంచారని, గ్యాస్‌ధర వంద శాతం పెంచారని, ఎరువుల ధరలు 12 సార్లు 300 నుంచి 800 శాతం పెరిగాయన్నారు. వ్యవసాయానికి 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. పంటలు ఎండిపోయి రైతులు పురుగులమందు తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చరమగీతం పాడుతోందన్నారు. రాజీవ్ ఉద్యోగశ్రీని రాజీవ్ యువకిరణాలుగా మార్చి ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. బాలికల సంరక్షణ పథకానికి వైఎస్ కోట్ల రూపాయలు వెచ్చిస్తే బంగారుతల్లి పథకం పేరుతో కిరణ్ ప్రభుత్వం ప్రజలకు వాతలు, కోతలు పెడుతోందన్నారు. 

టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడి 35ఏళ్ల రాజకీయ జీవితం వెన్నుపోట్లు, కుట్రలు,కుతంత్రాలలేనని విమర్శించారు. అమ్మ ఒడి పథకం ద్వారా పీజీ వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు పదవ తరగతి వరకు ఏడాదికి రూ.72 వేలు, ఇంటర్ వరకు రూ.84 వేలు, డిగ్రీ, పీజీ వరకు రూ.1.24 లక్షలు అందిస్తామన్నారు. సమావేశానికి జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుశేఖర్ అధ్యక్షత వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు ఇంద్రకరణ్‌రెడ్డి, పి.విజయారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, కేశ్‌పల్లి గంగారెడ్డి, శనిగరం సంతోష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు అంతి రెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.సిద్దార్థరెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్, ప్రతినిధులు పాల్గొన్నారు.

జలయజ్ఞం పనులు పూర్తి చేయాలి
సాక్షి,ఆదిలాబాద్/నిర్మల్: అర్ధంతరంగా నిలిపివేసిన జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభా పక్షనేత వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఆమె ప్రకటించారు. రైతుల కోరిక మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి వద్ద నిలిచిపోయిన ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టు 27వ ప్యాకేజీ పనులను ఆమె పరిశీలించారు. నిర్మల్ నియోజకవర్గంలో నిలిచిపోయిన హైలెవెల్ కెనాల్ పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి వద్ద నిలిచిపోయిన హైలెవెల్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు.

Share this article :

0 comments: