అడుగడుగునా జనాభిమానం.... రోడ్లపై ఎదురుచూపులు...జనం కేరింతలు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా జనాభిమానం.... రోడ్లపై ఎదురుచూపులు...జనం కేరింతలు..

అడుగడుగునా జనాభిమానం.... రోడ్లపై ఎదురుచూపులు...జనం కేరింతలు..

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

పవర్, క్రాప్, మిల్క్ హాలిడేలు ప్రకటించిన ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిన సమయమొచ్చింది
మరిపెడ బహిరంగ సభలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపు

సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను పీడిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు హాలిడే ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, మిల్క్‌హాలిడేలు ప్రకటించిన ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని అభిరామ్‌గార్డెన్‌లో బుధవారం జరిగిన పార్టీ పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం మరిపెడ మండల కేంద్రంలో జరిగిన భారీబహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు. 

పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆమె మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ రెక్కల కష్టంతో ఏర్పాటైన ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై ఎడాపెడా పన్నులు విధిస్తోందని విమర్శించారు. ఆరునెలలకోసారి చార్జీలు పెంచడం ప్రభుత్వానికి రివాజుగా మారిందని నిందించారు. ఆర్టీసీ చార్జీలు ఎడాపెడా పెంచారు...కరెంట్ చార్జీలు ఇప్పటికే మూడింతలు పెరిగాయి.. పరిశ్రమల మూసివేతతో 25లక్షల మంది రోడ్డున పడ్డారు... గామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లేదు, వైద్యం లేదు. కరెంటు లేదు.. ఇంతటి దారుణమైన పాలనకు త్వరలోనే మనం చరమగీతం పాడాలని కోరారు. మహానేత రాష్ర్టంలో 32లక్షల మందికి రుణమాఫీ చేశారని, ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. 

జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులు చేపట్టి కోటి ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారని వివరించారు. రూ.25వేల కోట్ల నిధులను ఒక్క తెలంగాణలోనే ఖర్చు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వైఎస్ పథకాలను పేరుపేరునా ప్రస్తావిస్తూ విజయమ్మ ప్రసంగిస్తున్న సందర్భంలో ప్రజలు పెద్దపెట్టున వైఎస్ అమర్హ్రే... జోహార్ వైఎస్సార్ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆమె కూడా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగిన ఆ సువర్ణయుగాన్ని మళ్లీ జగన్‌బాబు నాయకత్వంలో సాధించుకుందామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతీ పంచాయతీపై మన పార్టీ జెండా ఎగరాలని పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు కొండా సురేఖ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ైవె ఎస్ రాజశేఖరరెడ్డి కోసమైనా జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి అధిష్టానం వద్ద క్రెడిట్ కొట్టేయాలని సీఎం కిరణ్ కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు మురళీధర్‌రావు, కేకే మహేందర్‌రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్త సుజాతా మంగీలాల్‌లు ప్రసంగించారు.

పార్టీలో చేరిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, నాయకులు యుగంధర్‌రెడ్డి, రాంరెడ్డిలు పార్టీలో చేరారు. విజయమ్మ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పోటెత్తిన అభిమానం 

అడుగడుగునా జనాభిమానం.... రోడ్లపై ఎదురుచూపులు...జనం కేరింతలు.. ఇవీ వరంగల్ జిల్లాలో వైఎస్ విజయమ్మ పర్యటనలో కనిపించిన దృశ్యాలు. జిల్లాలో ఏడు గంటలు విజయమ్మ పర్యటించారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చేరుకున్న విజయమ్మకు అక్కడి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. పసుపు, కుంకుమ, గంధం పూసి అభిమానం చూపించారు. అక్కడే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయమ్మ.. గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. రఘునాథపల్లి నుంచి వరంగల్ వచ్చే మార్గంలో ప్రజలు విజయమ్మను చూసేందుకు రోడ్లపై నిలబడ్డారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 

కాజీపేటకు చేరుకోగానే వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాజీపేట నుంచి వరంగల్ అభిరాం గార్డెన్ వరకు బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా యువకులు, నేతలు, కార్యకర్తల నినాదాలతో ఓరుగల్లు హోరెత్తింది. వైఎస్‌ఆర్ అమరహే... జగన్ జిందాబాద్ అంటూ నినదించారు. అభిరాం గార్డెన్‌లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన విజయమ్మకు అక్కడ కూడా పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికాయి. బాణాసంచా పేళ్లులు, నినాదాలతో హోరెత్తించారు. విజయమ్మ మాట్లాడుతుండగానే భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే హాలులోని వారంతా కేరింతలు కొట్టారు. ఈ సమయంలో ఆమె స్పందిస్తూ ‘మనందరినీ దీవించేందుకు రాజశేఖర్‌రెడ్డే వచ్చారేమో?’ అందుకే వర్షం వచ్చిందని అనడంతో హాలంతా ఒక్కసారిగా జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో మార్మోగింది. పార్టీ శ్రేణులు జగన్ ఫొటోలు చూపెడుతూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి మరిపెడ బహిరంగసభకు వచ్చే దారికిరువైపులా జనం జేజేలు పలికారు.
Share this article :

0 comments: