నా ఇంటిని గజం గజం కొలిచి లెక్కలేసుకొని పోయారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా ఇంటిని గజం గజం కొలిచి లెక్కలేసుకొని పోయారు

నా ఇంటిని గజం గజం కొలిచి లెక్కలేసుకొని పోయారు

Written By ysrcongress on Wednesday, February 29, 2012 | 2/29/2012

వచ్చే సువర్ణయుగంలో పిల్లలను బడికి పంపితే తల్లులకు డబ్బులు
వృద్ధాప్య పింఛను రూ.200 నుంచి రూ.700కు పెంచుతాం
పల్లెల్లో సారా బట్టీలు లేకుండా చేసేలాఆడ పోలీసుల్ని పెడతాం

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి:నిర్దోషులను దోషులుగా చూపెట్టేందుకే అమాయకులను సైతం జైల్లో పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆ దివంగత నేత కోసం చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శిస్తానని నల్లకాల్వ సభలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నందుకే నాపై సీబీఐ దాడులు చేయిస్తున్నారు.. ఇన్‌కమ్‌టాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌చేత నోటీసులు ఇప్పిస్తున్నారు. నా ఇంటిని గజం గజం కొలిచి లెక్కలేసుకొని పోయారు. అయినా ఆవేళ ఇచ్చిన మాటకు నేను గర్వ పడుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని జగన్ పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 69వ రోజు మంగళవారం నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వినుకొండ గ్రంథాలయం బజారు నుంచి యాత్ర ప్రారంభించేందుకు సిద్ధం అవుతుండగానే ఉప్పరపాలెం గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడి తమ గ్రామం రావాలని పట్టుబట్టారు. దీంతో జగన్ వారి వెంట నడిచారు. మంగళవారం యాత్రలో 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

తల్లిదండ్రులకు రూ. వెయ్యి ఇస్తాం..

ఆ వేళ ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాను కాబట్టే పేదరికాన్ని దగ్గర నుంచి చూడగలిగాను. వేలకు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతున్నాను. పేదవాడి గుండె చప్పుడు వినగలుగుతున్నాను. ఇప్పటి వరకు 600 పైచిలుకు ఇళ్లకు నేను వెళ్లా. ఆ పూరి గుడిసెల్లోకి అడుగుపెడుతూ ఉన్నప్పుడు వాళ్లు బతుకుతున్న తీరు నా కళ్లతో చూశా! ఆరు.. ఏడు.. ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను ఆ అక్కా చెల్లెమ్మలు పనులకు పంపిస్తున్నారు. ఆ అక్కాచెల్లెమ్మలను అడిగా.. అమ్మా..! పిల్లలను బడికి పంపించకపోతే పేదరికం ఎలా పోతుంది తల్లీ అని అడిగా. ‘అన్నా.. మా పిల్లలను బడికి పంపించి వాళ్లను గొప్పగా చదివించాలని మాకు కూడా ఉందన్నా. కాని పిల్లలను చదివించాలంటే ముందుగా మా కడుపు నిండాలి కదన్నా’ అని వారు చెప్పినప్పుడు బాధనిపించింది. ప్రతి అక్కకూ.. ప్రతి చెల్లెమ్మకు కూడా నేను ఇవాళ చెప్తున్నాను. మీ పిల్లలను బడికి పంపించండి చాలు.. అలా పంపినందుకు పదో తరగతి చదివే ప్రతి విద్యార్థికీ నెలకు రూ.500 చొప్పున, అంతకంటే పై చదువులు చదివిస్తే రూ.750, ఇంకా ఉన్నత చదువులు చదివిస్తే రూ.1,000 చొప్పున తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్లలో నెలనెలా మేం వేస్తామని హామీ ఇస్తున్నా. మీరు మీ పిల్లలను బడికి పంపించండి.. ఆ పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్లుగాను తీర్చిదిద్దే పెద్దపెద్ద చదువులు చదివించుకునే బాధ్యతలు మేం చూసుకుంటాం. 

వృద్ధాప్య పెన్షన్ రూ.700కు పెంచుతాం

వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలు మూడు పూటలా భోజనం కోసం పొలాల్లో పనులు చేసుకుంటున్న సంఘటనలు నేను చూశా.. ఆ అవ్వల చేతులు పట్టుకొని అడిగా.. అవ్వా ఈ వయసులోనా నువ్వు పనిచేసేది అని. ‘కొడుకా..! మీ నాయన పుణ్యాన రూ.200 పెన్షన్ అయితే వస్తోంది కానీ.. ఆ రూ.200తో మూడు పూటలా భోజనం తినలేం కదా కొడుకా’ అని ఆ అవ్వలు అన్నప్పుడు గుండె పగిలేంత బాధనిపించింది. త్వరలో రాబోయే సువర్ణయుగంలో ఏ అవ్వా తాతా కూడా బతకటానికి పనులకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా..రూ.200 పెన్షన్ను రూ.700కు పెంచి ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని చెప్తున్నాను. ఏ అక్కా.. ఏ చెల్లెమ్మ కూడా బ్యాంకు మేనేజర్ల దగ్గరకు వెళ్లినప్పుడు వడ్డీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా వడ్డీలేని రుణాలు ఇచ్చే సువర్ణయుగం త్వరలోనే వస్తుందని చెప్తున్నాను.

పల్లెల్లో సారా, బ్రాందీ ఉండదు

కొన్ని రోజులుగా అసెంబ్లీ జరుగుతోంది.. అసెంబ్లీలో వాగ్వాదం జరుగుతోంది. రకరకాల తిట్లు కూడా తిట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒకాయన అంటారూ.. మద్యంను ఈ నెలకంటే వచ్చే నెల కనీసం 15 శాతం ఎక్కువ మందికి తాగించాలీ అని. చంద్రబాబు అంటారూ.. కాదుకాదు మద్యం చాలా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. నేను అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే ఇంటింటికీ మద్యం అందుబాటులోకి తెస్తాను అని చెప్తున్నారు. మనఖర్మ ఏమిటంటే.. ఇలాంటి నాయకులు ఒకరు ముఖ్యమంత్రి స్థానంలో, ఇంకొకరేమో ప్రతిపక్షంలో ఉన్నారు. ఇవాళ ప్రతి అక్కకూ... ప్రతి చెల్లెమ్మకూ చెప్తున్నాను. రాబోయే సువర్ణయుగంలో వెయ్యి మంది నివాసం ఉంటున్న ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి చెందిన పది మంది అక్కాచెల్లెమ్మలను ఆడ పోలీసులుగా తయారు చేస్తాను. పల్లెల నుంచి సారా, బ్రాందీలను తరిమేస్తామని చెప్తున్నా.


Share this article :

0 comments: