పేరు వైఎస్‌కు వస్తుందనే భయంతోనా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేరు వైఎస్‌కు వస్తుందనే భయంతోనా!

పేరు వైఎస్‌కు వస్తుందనే భయంతోనా!

Written By news on Monday, February 27, 2012 | 2/27/2012

 దివంగత ముఖ్యమంత్రి రాష్ట్రంలో పొలాలను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ం జరక్కుండా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నింద ని, అందులో భాగంగానే జీఓ నెంబర్-1 పేరిట ఉత్తర్వులను జారీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. నెంబర్-1 జీఓ ప్రకారం పరిపాలనానుమతులు వచ్చిన ప్రాజక్టు పనులు రెండేళ్లలోపు మొదలు పెట్టక పోతే అది మళ్లీ మొదటికి వచ్చినట్లేనన్న అర్థం స్ఫురిస్తోందని అన్నారు. అంటే ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాటింది. కానీ వీటి పనులేవీ ప్రారంభం కాలేదు, కనుక ఆ ప్రాజెక్టులు మూడూ రద్దయినట్లేనా? వాటికి మళ్లీ టెండర్లు పిలుస్తారా ? అని బాజిరెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని గందరగోళంలో పడేసేందుకే ఈ జీవో జారీ అయిందని, అసలు దీని జారీ వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటనేది ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యవ సాయానికి, ముఖ్యంగా రైతులకు ప్రాజెక్టులే జీవనాధారంగా భావించి దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో వీటి నిర్మాణాన్ని చేపట్టారని ఆయన అన్నారు. కేంద్రంపై వై.ఎస్ ఒత్తిడి తెచ్చి ఏఐబీపీ ద్వారా కోట్లాది రూపాయల నిధులు తెసే,్త ఆయన మరణం తరువాత జలయజ్ఞాన్ని గత మూడేళ్లలో రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో నీటిపారుదల రంగాన్ని ఏ విధంగానైతే భ్రష్టు పట్టించారో అదే మాదిరిగా కిరణ్ సర్కారు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని వ్యవసాయం దండగ అనే పరిస్థితుల్లోకి నెట్టుతోందని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో 12 ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేశారని, వీటివల్ల 19 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా ఇచ్చారని ఆయన వివరించారు. ఆయన హయాంలో 45 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై ఖర్చు చేశారని ఆయన అన్నారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేవలం 9 వేల కోట్లు మాత్రమే వ్యయం చేశారన్నారు. 

వైఎస్ హయాంలోఅంత త్వరిత గతిన పూర్తయిన ప్రాజెక్టులు ఇపుడు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని బాజిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ హయాంలో పూర్తయిన, 90 శాతం పూర్తయిన కొన్ని ప్రాజక్టులకు మిగిలిన కొద్దిపాటి నిధులను కేటాయించడంలో కిరణ్ సర్కారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నది? ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆ మంచి పేరు వైఎస్‌కు వస్తుందనే భయంతోనా! ఈ భయంతోనే ప్రాజెక్టులకు కిరణ్ సర్కారు అడుగడుగునా బ్రేకులు వేస్తోందని ఆయన విమర్శించారు. కిరణ్ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో 23,000 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు కేటాయించినా వాటిని ఖర్చు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కిరణ్ పాలన చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తోందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఆయా ప్రాజెక్టుల కింద లబ్దిపొందే రైతుల వద్దకు వెళ్లి వారిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులను విస్మరించిన చంద్రబాబుకు ఏగతి పట్టిందో కిరణ్‌కూ అదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. 

కోవూరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా సీమాంధ్రలో కూడా తెలంగాణకు మద్దతు ఉందని కె.చంద్రశేఖర్‌రావు చెప్పదల్చుకున్నట్లుగా ఉందని, అందువల్ల పోటీ గురించి చర్చ అవసరం లేదని బాజిరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహబూబ్‌నగర్‌లో దివంగత రాజేశ్వర్‌రెడ్డి సతీమణి పోటీలో లేనందున ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన అన్నారు.
Share this article :

0 comments: