వైఎస్ పథకాలపై కనికరం చూపండి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పథకాలపై కనికరం చూపండి: విజయమ్మ

వైఎస్ పథకాలపై కనికరం చూపండి: విజయమ్మ

Written By ysrcongress on Wednesday, February 29, 2012 | 2/29/2012

 దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమపథకాలను ప్రభుత్వం నీరుగారుస్తుందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. పేద, సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాలని ఆమె సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వార్షిక ఆదాయం పెరుగుతున్నా, వ్యాట్ ధర ఎందుకు పెంచుతున్నారో అర్ధం కావడంలేదని విజయమ్మ ప్రశ్నించారు.

అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తర సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారని, రాష్ట్రంలో ఎన్ని సమస్యలు వచ్చిన, ఎన్నిసార్లు పెట్రోలు, గ్యాస్ ధరలు పెరిగినా ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ వచ్చారని అన్నారు. పన్నులు పెంచకుండానే సంక్షేమ పథకాలు ఎలా ప్రవేశపెట్టగలుగుతున్నారని అనాడు కేంద్రం వైఎస్‌ను అడిగిందని ఆమె అన్నారు. అప్పుడు అన్ని పథకాలు కొనసాగాయి, ఇప్పుడు కొన్ని పథకాలు ఎందుకు కొనసాగడంలేదని విజయమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతోంది, చేనేత కార్మికులకు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని విజయమ్మ నిలదీశారు. దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం బాధకరమని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆదాయం ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు పరచడం లేదని, ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు నష్ట పోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పన్నులతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. వైయస్ కాలంలో పన్నులేవీ పెరగలేదని పెరిగిందల్లా సంక్షేమమే అన్నారు. 

ఉచిత విద్యుత్‌ను ఎందుకు నీరుగారుస్తోందని విజయమ్మ ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన విధంగా పేదవారికి బియ్యం కోటా పెంచలేదని, సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించారని ఆమె విమర్శించారు. పేదలు కొనుక్కోలేని విధంగా నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. బడ్జెట్‌లో వరికి బోనస్ ప్రస్తావన లేదని, రైతులకు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని విజయమ్మ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలపై విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశంసించారు.
Share this article :

0 comments: