రైతు వరి కోసేటపుడు బస్తా రేటు రూ.650కో, 700కో తగ్గించేస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు వరి కోసేటపుడు బస్తా రేటు రూ.650కో, 700కో తగ్గించేస్తున్నారు

రైతు వరి కోసేటపుడు బస్తా రేటు రూ.650కో, 700కో తగ్గించేస్తున్నారు

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012


*మిల్లర్లకు పెంచుతున్నారు 

* రైతు వరి కోసేటపుడు బస్తా రేటు రూ.650కో, 700కో తగ్గించేస్తున్నారు
* అవే వడ్లు మిల్లర్ల చేతికి వెళ్లగానే రూ.900 పైచిలుకుదాకా పెంచుతున్నారు
* వ్యవసాయంపై అవగాహనలేనివారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు
* రైతుల్ని మీ చావు మీరు చావండని గాలికి వదిలేశారు

ఓదార్పు యాత్రనుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: రైతన్న వరి కోసుకునేటప్పుడు బస్తా వడ్ల రేటును రూ.650కో.. రూ.700కో తగ్గించేస్తున్నారని, మూడు నెలలు దాటాకా అవే వడ్లు మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోగానే బస్తా ధర రూ.900 పైచిలుకుదాకా పెంచుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై అవగాహనలేనివారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 70వ రోజు బుధవారం ఆయన బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఐదు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. గరికపాడులో షేక్ నన్నేసాహెబ్ కుటుం బాన్ని ఓదార్చారు. గంగులపాలెంలో మాజీ సర్పంచ్ ఈపూరి నారాయణరావును పరామర్శించారు. ఈ నెల 25న ఆయన కుమారుడు నాగేశ్వర్‌రావు, అల్లుడు వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బుధవారం యాత్రలో పలు గ్రామాల్లో జగన్ చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

రైతులను గాలికి వదిలేశారు..: ఈ మధ్యకాలంలోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వెళ్లా. అక్కడ రైతన్న పసుపు పంట వేశాడు. రూ.1.20 లక్షలు ఖర్చు చేసి ఆ రైతన్న పసుపు పంట వేశాడు. వేసిన తర్వాత ఇవాళ ఆ రైతన్న పరిస్థితి ఎలా ఉందంటే.. ఎకరాకు 25 క్వింటాళ్లు రావాల్సిన పసుపు వర్షాలు అంతంత మాత్రంగానే పడడంతో 10 క్వింటాళ్లకు పడిపోయింది. ఎలాగోలా కష్టపడి రైతన్న పసుపుతోడి యార్డుకు తీసుకొనిపోయి అమ్మితే కనీసం రూ.3, 4 వేలు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఎకరాకు ఎట్టా లేదన్నా.. రూ.60 వేలు నష్టం వచ్చే పరిస్థితుల్లో ఆ రైతన్న వ్యవసాయం చేయాల్సి వస్తోంది. ఇవాళ మిర్చి రైతుల పరిస్థితి అలానే ఉంది. ఈ పాలకులకేమో రైతు కష్టాలపై, వ్యవసాయంపై కనీసం అవగాహనకూడా లేదు. ఇవాళ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతోంది. లక్ష ఎకరాల భూమిని బీడుగా పెట్టి మా గోడు వినండని రైతులు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తుంటే... పాలకులేమో.. మీ చావు మీరు చావండీ అంటూ రైతులను గాలికి వదిలేశారు.

పల్లెలు బాగుపడాలంటే పిల్లలు చదువుకోవాలి
ఈ మధ్య కాలంలోనే కృష్ణా జిల్లా మైలవరం గిరిజన తండాలకు వెళ్లాను. అక్కడ సారా తాగి 20 మంది చనిపోయారు. ఎలా జరిగిందమ్మా..! అని అక్కడి అక్కాచెల్లెమ్మలను అడిగాను. ‘అన్నా..! మా కళ్లకు కనబడేట్టే బ్రాందీ షాపు పెట్టారు... బెల్టు దుకాణం తెరిచారు.. అదీ చాలదన్నట్లుగా బట్టీలు పెట్టి సారా డిపో కూడా నడిపిస్తున్నారన్నా’ అని వారు చెప్పినప్పుడు బాధనిపించింది. అమ్మా.. ఒళ్లంతా విషం పాకుతుంటే 108 వాహనానికి ఫోన్ చేయ్యలేదా తల్లీ అని అడిగితే.. ‘అన్నా ఫోన్ చేసినా మూడు గంటల వరకు కూడా అంబులెన్స్ రాలేదన్నా.. అది వచ్చే వరకే మా వాళ్లు ప్రాణాలు విడిచి వెళ్లిపోయారన్నా’ అని చెప్పినప్పుడు గుండె పగిలేంత బాధనిపించింది. పల్లెలు బాగుపడాలంటే పిల్లలు చదువుకోవాలి. వారిని బ్రాందీకి దూరంగా ఉంచాలి. త్వరలోనే ఒక సువర్ణయుగం వస్తుంది. ఆ సువర్ణయుగంలో వెయ్యి మంది నివాసం ఉంటున్న ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి చెందిన పది మంది అక్కాచెల్లెమ్మలను ఆడపోలీసులుగా తయారు చేస్తాను. మన ఊరిలో బ్రాందీ దుకాణం, సారా ఉండకూడదు. 

వలసపోయిన ఊరు.. వైఎస్ కోసం తిరిగొచ్చింది
చుట్టూ కొండలు.. దట్టమైన నల్లమల అడవి... నడుమ ఓ చిన్న పల్లెటూరు. పేరు గరికపాడు. మావోయిస్టులకు మంచి పట్టున్న ప్రాంతం. రాజకీయ నేతలకు ఇటువైపు రావాలంటే వెన్నులో వణుకే. ఇప్పటికీ ఇక్కడ నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటు పోలీసులు..అటు అన్నల ఒత్తిళ్లకు తాళలేక యువత బతుకుదెరువును వెతుక్కుంటూ పట్నం వెళ్లిపోయింది. మరోవైపు కరువు మీద పడి రైతు కూలీలు వలస పోయారు. జనం లేక కళ తప్పిన ఈ పల్లె బుధవారం జనంతో కిటకిటలాడింది. వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో చాలా కాలం తరువాత ఊరు వాళ్లంతా మళ్లీ తల్లి ఒడిచేరారు. ఉపాధిని వెతుక్కుంటూ పట్నం పోయి ఊరికి దూరమైన తమ పిల్లలకు కబురంపి రప్పించారు. తమ ఆడపిల్లలను, అల్లుళ్లను తీసుకొచ్చారు. ఊరి దేవర గుడి పక్కనే వైఎస్సార్ విగ్రహం ప్రతిష్టించి బుధవారం జగన్‌మోహన్‌రెడ్డితో ఆవిష్కరింపజేశారు.

రోజంతా నల్లమలలోనే..
అక్కడ వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించి తిరుగు ప్రయాణమైన జగన్‌కు ఇంకా దట్టమైన అడవిలో ఉన్న పమిడిపాడు గ్రామస్తులు అడ్డం పడ్డారు. ‘అన్నా...! నాన్న గారి విగ్రహం ప్రతిష్ట కోసం ఇంటికి ఆడపిల్లలు వచ్చారన్నా.. ఒక్కసారి మా ఊరికి వచ్చిపో అన్నా అంటూ ప్రాథేయపడ్డారు.ఆ గ్రామానికి వెళ్లొద్దని వారించబోయిన నరసరావుపేట డీఎస్పీ వెంకట్రామిరెడ్డి.. జగన్ పట్టుదల తెలిసి మనసు మార్చుకున్నారు. తన బలగాలను అప్రమత్తం చేశారు. జగన్ పమిడిపాడుకు వెళ్లి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు జగన్ రేమిడిచర్ల గ్రామం చేరుకున్నారు. అప్పటికే సూర్యాస్తమయం అయింది. పోలీసుల్లో కలవరం రెట్టింపయింది. బాగా పొద్దుపోయే సమయానికి యాత్ర బొల్లాపల్లికి చేరుకుంది. ఓదార్పు యాత్ర ఇలా బుధవారం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాల్లోనే సాగింది.
Share this article :

0 comments: