లోక్‌సభ సెక్రటేరియట్ విలువలకు ప్రాధాన్యమిచ్చా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్‌సభ సెక్రటేరియట్ విలువలకు ప్రాధాన్యమిచ్చా..

లోక్‌సభ సెక్రటేరియట్ విలువలకు ప్రాధాన్యమిచ్చా..

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012

నిర్ణయానికి ముందు మేకపాటితో ఫోన్‌లో మాట్లాడిన మీరాకుమార్
తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని పునరుద్ఘాటించిన ఎంపీ
నెల్లూరు ఎంపీ స్థానం ఖాళీపై ఈసీకి సమాచారమిచ్చిన 
లోక్‌సభ సెక్రటేరియట్ విలువలకు ప్రాధాన్యమిచ్చా.. 
ఇక ముందు కూడా అదే బాటలో నడుస్తా..: మేకపాటి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఎట్టకేలకు ఆమోదించారు. దివంగత వుుఖ్యవుంత్రి ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టను వుంటగలపడానికి కాంగ్రెస్ హైకవూండ్ వూర్గదర్శకత్వంలో కుట్ర అవులవుతుండటం, క్రిమినల్ కుట్రదారుగా వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో తీవ్ర వునస్తాపం చెందిన మేకపాటి.. అందుకు నిరసనగా గత ఏడాది ఆగస్టు 24న రాజీనామా చేశారు. అప్పట్నుంచీ పెండింగ్‌లో ఉన్న ఈ రాజీనామాపై బుధవారం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాను ఆమోదించడానికి ముందు మేకపాటి మనోగతం తెలుసుకోవడానికి మీరాకుమార్ మంగళవారం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామాపై వివరణ కోరారు. తన వైఖరిలో మార్పులేదని, రాజీనామాను వెంటనే ఆమోదించాలని మేకపాటి మరోసారి పునరుద్ఘాటించారు. 

రాజీనామా వెనక ఎవరి ఒత్తిళ్లూ లేవని, సత్వరమే రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో ఆయన స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేసిన వెంటనే.. నెల్లూరు స్థానం ఖాళీ అయిందన్న సమాచారాన్ని లోక్‌సభ సచివాలయం బుధవారం సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలిపినట్లు సమాచారం. రాజీనామా ఆమోదం సమాచారాన్ని లిఖితపూర్వకంగా మేకపాటికి కూడా పంపుతున్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.

206కు చేరిన కాంగ్రెస్ బలం..: మేకపాటి రాజీనామా ఆమోదంతో లోక్‌సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం ఒకటి తగ్గి 206కి చేరింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీల సంఖ్య కూడా 31కి పడిపోయింది. రాష్ట్రంలో 2009లో కాంగ్రెస్ తరఫున 33 మంది ఎంపీలు ఎన్నికవ్వగా కడప లోక్‌సభ స్థానానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి ఎన్నికవ్వడంతో కాంగ్రెస్ బలం 33 నుంచి 32కి తగ్గిపోయింది. ఇప్పుడది మరొకటి తగ్గి 31కి చేరింది. ఖాళీ అయిన నెల్లూరు స్థానానికి ఆర్నెల్లలోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

మాటకు కట్టుబడ్డ మేకపాటి..: రాష్ట్రం నుంచి మేకపాటితోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాలు పెండింగ్‌లో ఉండగా ఇటీవల కోమటిరెడ్డి స్పీకర్‌ను కలిసి వెళ్లారు. తర్వాత గత సమావేశాల్లో సభకు హాజరయ్యారు. ఆయన రాజీనామాపై స్పీకర్ నిర్ణయం ఏమిటన్నది అధికారికంగా ఇప్పటివరకు వెల్లడి కాలేదు. అయితే మేకపాటి మాత్రం తాను రాజీనామా చేసినప్పట్నుంచీ ఏనాడూ పార్లమెంట్ సమావేశాలకుగానీ, కమిటీ సమావేశాలకుగానీ హాజరు కాలేదు. మేకపాటి వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని స్పీకర్ ఇంతకాలం ఎదురుచూశారని, ఆర్నెల్లు దాటడంతో మరోసారి మాట్లాడి చూద్దామని ఫోన్ చేసి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.

రాజీనామా నేపథ్యమిది...: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో క్రిమినల్ కుట్రదారుగా వైఎస్ పేరును చేర్చినందుకు మనసు గాయపడ్డ మేకపాటి.. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఆగస్టు 24న ఎంపీ సబ్బం హరితో కలిసి స్పీకర్ మీరాకుమార్ వద్దకు వెళ్లి ఏకవాక్య రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ‘‘నా లోక్‌సభ సభ్యత్వానికి తక్షణమే అవుల్లోకి వచ్చేలా రాజీనావూను సవుర్పిస్తున్నాను’’ అని అందులో ఆయున రాశారు.

స్వాగతిస్తున్నా..: మేకపాటి

నెల్లూరు: తన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ‘‘మేడమ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. వైఎస్‌గారిపై నాకున్న అభిమానానికి, యువనేత జగన్ మోహన్‌రెడ్డిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న కక్ష సాధింపు చర్యలకు రాజీనామా చేయడం ధర్మంగా భావించా. నీతి, నిజాయితీ, విలువల ఆచరణకు ఇంత కంటే మార్గం లేదు. 29 సంవత్సరాల రాజకీయాల్లో నేను విలువలకు ప్రాధాన్యమిచ్చా. ఇక ముందు కూడా అదే బాటలో నడుస్తా’’ అని అన్నారు. కోవూరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు. 

‘‘నా రాజీనామా కూడా ఆమోదించారు కాబట్టి ఏ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు లోక్‌సభ స్థానంలో భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించబోతున్నాం’’ అని అన్నారు. ‘‘నా రాజీనామా నిర్ణయంపై స్పీకర్‌కు డిసెంబర్‌లో జరిగినశీతాకాల సమావేశాల సందర్భంగా వివరణ ఇచ్చా. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రెండుసార్లు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడేందుకు దివంగత నేత చేసిన కృషిని కూడా వివరించా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడినా, గెలిచినా తానేనని స్పష్టం చేసిన వ్యక్తి వైఎస్. అలాంటి మహానేత మరణానంతరం ఆయన కుమారుడు జగన్‌పై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. దివంగత నేత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసింది. ఎవరో పిటిషన్లు వేస్తే హైకోర్టు వాటిని స్వీకరించింది. ఈ కేసుల్లో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయింది. హైకోర్టు చెప్పనప్పటికీ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో దివంగత నేత పేరును చేర్చింది. రాష్ట్ర ప్రజలతో పాటు నేను కూడా మనస్తాపం చెందాను. అందుకే రాజీనామా చేశా’’ అని మేకపాటి వివరించారు.

Share this article :

0 comments: