పల్లెలో పేదరికాన్ని దగ్గరగా చూశా: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పల్లెలో పేదరికాన్ని దగ్గరగా చూశా: జగన్

పల్లెలో పేదరికాన్ని దగ్గరగా చూశా: జగన్

Written By news on Tuesday, February 28, 2012 | 2/28/2012

నల్ల కాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనకు ఈ వేధింపులు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోని నూజెండ్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సుమారు 600 గ్రామాల్లో పర్యటించానని, ప్రతి పల్లెలో పేదరికాన్ని దగ్గరగా చూశానని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహానేత హయాంలోని స్వర్ణయుగం త్వరలోనే వస్తుందని ఆయన అన్నారు. వృద్ధులకు 700 రూపాయల పెన్షన్ అందిస్తామని.. ప్రతి కుటుంబంలో పిల్లాడిని డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ చేసే తామే తీసుకుంటామని ఆయన తెలిపారు.

పేద కుటుంబాలను నిర్వీర్యం చేస్తున్న మద్యం దుకాణాలు ఇక పల్లెలో ఉండవని జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే సగం ధరకే మద్యాన్ని అందిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీపై జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ భూటకమని జగన్ తెలిపారు.
Share this article :

0 comments: