వైఎస్సార్ సీపీలోకి తెలుగు యువత కార్యదర్శి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి తెలుగు యువత కార్యదర్శి

వైఎస్సార్ సీపీలోకి తెలుగు యువత కార్యదర్శి

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012


రామచంద్రపురం(తూర్పుగోదావరి),న్యూస్‌లైన్: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అల్లు మురళి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పార్టీ రీజనల్ కో- ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మురళికి సుబ్బారెడ్డి పార్టీ కండువాను వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పరిశీలకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: