అడుగేస్తే వంద! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగేస్తే వంద!

అడుగేస్తే వంద!

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013


 ‘రాజు వెడలె రవితేజములలరగ’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు పాదయాత్ర. త్వరలో 2 వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న చంద్రబాబు పూర్తి హైటెక్ హంగులతో యాత్ర కొనసాగిస్తున్నారు. బాబు తన పరివారంతో ఒక్క అడుగు వేయడానికి అవుతున్న ఖర్చు అక్షరాలా వంద రూపాయలు. ఒక కిలోమీటరు దూరాన్ని వెయ్యి అడుగుల్లో చేరుకుంటారు. ప్రతిరోజూ సగటున 12 నుంచి 15కిలోమీటర్ల మేర బాబు యాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర మధ్యలో బాబు విశ్రాంతి తీసుకోవడానికి సకల సౌకర్యాలతో కూడిన ఓ అధునాతన బస్సు, రాత్రిపూట బసచేయడానికి మరో విలాసవంతమైన బస్సు ఆయన వెంట ఉంటాయి. సుమారు 10 మందితో కిచెన్‌స్ట్ఫాతో రెండు వ్యాన్లు ఆయనను అనుసరిస్తున్నాయి. పాదయాత్ర కొనసాగిస్తున్న బాబును కంటికి రెప్పలా కాపాడేందుకు కేంద్రం బ్లాక్‌క్యాట్ కమాండోలతో జడ్‌ప్లస్ భద్రత కల్పించగా, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. మొత్తం మూడు షిఫ్ట్‌ల్లో బాబుకు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. వీరుగాక సుమారు 300 మందికిపైగా ప్రైవేటు సైన్యం చంద్రబాబును అనుసరిస్తోంది. బాబు రాత్రిపూట బసచేసినచోటే ప్రతిరోజూ అందరికీ టిఫిన్, భోజనానికి ప్రత్యేకమైన వంట ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రసంగాన్ని ప్రజలకు విన్పించేందుకు ప్రత్యేక వాహనంలో డాల్బిసౌండ్ మైక్‌సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. మొత్తంగా బాబు ప్రతిరోజూ సుమారు 12నుంచి 14కిలోమీటర్లు నడుస్తుండగా, కిలోమీటరుకు లక్షరూపాయల చొప్పున ఖర్చవుతోందని పేరు ప్రచురించడానికి ఇష్టపడని ఒక గుంటూరుజిల్లా నేత ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఈ ఖర్చంతంటినీ ఏ జిల్లాలో పాదయాత్ర చేసే దారిలో ఏ నియోజకవర్గంలో తిరిగితే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లాపార్టీ భరించాల్సి ఉంటుంది. దీంతో బాబు పాదయాత్ర తమ ఇలాఖాకు వస్తుందంటేనే నేతలు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. (చిత్రం) బాబు పాదయాత్రలో వాహన శ్రేణి

source: http://www.andhrabhoomi.net/content/babu-pada-yathra
Share this article :

0 comments: