రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది

రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది

Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013


చంద్రబాబు పాదయాత్రలో రోజూ ప్రభుత్వాన్ని తిడతారు
అధికారంలో ఉండే అర్హతే ఈ సర్కారుకు లేదంటారు
అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అవిశ్వాసం పెట్టరు
ఆయనకు ‘అవసరం’ ఉంటేనే అవిశ్వాసం పెడతారట
తనపై సీబీఐ, ఈడీ, ఐటీల దర్యాప్తు జరగకుండడమే ఆ ‘అవసరం’
రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది
కిరణ్ నిర్లక్ష్యం వల్ల కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడ్డాయి
ఆ పరిశ్రమల్లో పనిచేసే లక్షల మంది ఇప్పటికే రోడ్డునపడ్డారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 60, కిలోమీటర్లు: 867.2

‘‘చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా ఓ మాట చెప్తున్నారు. అవసరమైతే అవిశ్వాసం పెడతారట.. ప్రజలకు అవసరమైతే కాదండీ..! ఆయనకు అవసరమైతే అవిశ్వాసం పెడతారట. చంద్రబాబు మీద సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా ఉండటం ఆయనకు అవసరం. ఇది ఆయన అవసరం కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టరు.’’
- షర్మిల

 ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ తన పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతారు. తుగ్లక్ పరిపాలన అంటారు. అసమర్థ ప్రభుత్వమంటారు. ఒక్క రోజు కూడా అధికారంలో కూర్చోవడానికి అర్హత లేదనీ అంటారు. మరి అలాంటి అర్హత లేని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అది మాత్రం పెట్టరు. అందుకే ఆయన పాదయాత్ర ఒక బూటకం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరోప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ గ్రామంలో షర్మిలకు స్వాగతం పలికేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

బాబు అవసరమైతేనే అవిశ్వాసం..

‘‘రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాళ దేశ విదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ హెరిటేజ్ దుకాణాలున్నాయి. మనదేశంలో అతిధనవంతుడైన రాజకీయవేత్త చంద్రబాబేనని తెహల్కా బయటపెట్టింది. ఈ విషయాల్లో సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా ఉండడానికిగాను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అవిశ్వాసం పెట్టరు. ఈ ప్రభుత్వం ఇక కూలిపోదు అని నమ్మకం కుదిరాక.. కాంగ్రెస్ పెద్దలు పచ్చజెండా ఊపి ‘చంద్రబాబూ ఇక అవిశ్వాసం డ్రామా ఆడదాం’ అని చెప్తే అప్పుడు ఆయన అవిశ్వాసం డ్రామా మొదలు పెడతారు. గతంలో చిరంజీవి వేరే పార్టీలో ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు పెట్టలేదు. చిరంజీవి కాంగ్రెస్‌లో కలిశాక అవిశ్వాసం పెట్టారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం మరోటి అవసరం లేదు. మొన్నటికి మొన్న ఎఫ్‌డీఐ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే తన హెరిటేజ్ కోసం తన ఎంపీలను గైర్హాజరుచేయించి ఆ బిల్లుకు మద్దతు పలికింది నిజం కాదా?

కిరణ్ హయాంలోనూ.. చంద్రబాబు పాలనే!

2012 జనవరిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక జాతీయ సభలో మాట్లాడారు. మన రాష్ట్రానికి రూ.6.48 లక్షల పెట్టుబడులు తెచ్చి రూ.7 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారట. దీనికి సంబంధించి అప్పుడే 90 శాతం పనులు కూడా పూర్తి చేశారట. అట్లాగే 2011 నవంబర్‌లో కూడా ఒక సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 35 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అయ్యా కిరణ్‌కుమార్ రెడ్డి గారూ.. మీ నిర్లక్ష్యం మూలంగా రాష్ట్రంలో విద్యుత్తు సమస్య ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది రోడ్డున పడ్డారు. చంద్రబాబు కూడా మీలాగే పెద్ద పెద్ద అంకెలు చెప్పేవారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన రెండో భాగం. మన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసింది చంద్రబాబే. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో సరిగ్గా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే జిల్లా వాసులు కాబట్టేమో.. చంద్రబాబు ఏ పనిచేశారో ఈ ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఒక జాతీయ సమావేశంలో ఇలాగే దొంగలెక్కలు చెప్తుంటే.. స్విట్జర్లాండుకు చెందిన ఆర్థిక మంత్రి లేచి ఒక మాటన్నారు... చంద్రబాబు గారూ ఇలాంటి దొంగ లెక్కలు మా దేశంలో చెప్తే జైల్లో పెడతారని ఆయన హెచ్చరించారు.’’ 

నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర

షర్మిల పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. నల్లగొండ సరిహద్దు గ్రామం మాల్ వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చౌదరిపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర యాచారం, నక్కలగుట్ట తాండా, చింతపట్ల తాండా, తుమ్మలూరి గూడెం మీదుగా నల్లగొండ జిల్లా మాల్‌కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు మాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు.శుక్రవారం 14.8 కిలోమీటర్లు నడవగా.. మొత్తం 867.2
Share this article :

0 comments: