అవిశ్వాసానికి టిడిపి ఇష్టపడడం లేదా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసానికి టిడిపి ఇష్టపడడం లేదా!

అవిశ్వాసానికి టిడిపి ఇష్టపడడం లేదా!

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం తమకు తాముగా పెట్టరాదని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారా?లేక వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా?అన్నది తెలియదు కాని, తాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇష్టపడడం లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూ జబ్బలు చర్చుకోవడం కంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తనకు మద్దతిచ్చే వారితో కలిసి వారే అవిశ్వాసం పెట్టాలని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన కలుసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తగు సమయం చూసి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చంద్రబాబు చెప్పారన్నారు.తగు సమయం అంటే ఏమిటో కేశవ్ వివరించి ఉంటే బాగుండేది. గతంలో కూడా అనేకసార్లు ఈ వివాదం జరిగింది. అప్పుడు కూడా ముందు అవిశ్వాసం పెట్టడానికి ఇష్టపడేవారు. ఆ తర్వాత వారు పెట్టేసరికి పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు కాని, కేశవ్ కాని ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. దీనివల్ల టిడిపి ఏదో సందేహిస్తున్నదన్న భావన కలిగిస్తున్నారనిపిస్తుంది.అది పార్టీకి నష్టం కలిగించవచ్చు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130208_20.php

Share this article :

0 comments: