తమ్ముడూ... టైముంది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తమ్ముడూ... టైముంది!

తమ్ముడూ... టైముంది!

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

Written by Srinu On 2/7/2013 3:34:00 PM (sakshi)
తప్పించు తిరుగువాడు ధన్యుడు అన్నాడు సుమతీ శతకకారుడు. నీటి మీద రాతల్లాంటి మాటలతో జనాన్ని ఏమార్చుతూ నిత్యం పబ్బం గడుపుకోవడంలో నయా రాజకీయ నేతలను మించిన వారు లేరనడంలో అణుమాత్రమైనా అనుమానం అక్కర్లేదు. ఎన్నికల వేళ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ ఉద్దరిస్తామంటూ నమ్మబలుకుతూ నట్టేటా ముంచడంలో మన నేతలకు మంచి చరిత్రే ఉంది. గద్దెనెక్కేందుకు గంపగుత్తుగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేయంలో వారెంత సిద్ధహస్తులో గంటల తరబడి వరుసలో నిలబడి ఓట్లేసిన జనానికి ఎరుకే.

ప్రజాభిమానం పొందిన వారు పాలక పగ్గాలు చేపట్టి జనాన్ని ఉద్ధరించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ప్రజలను పీడించుకు తినడమే పరమావధిగా ప్రభువులు పరిపాలన సాగించడం పరిపాటిగా మారుతోంది. ఇటువంటి సమయంలో ప్రతిపక్షంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ బాధలు పట్టించుకోని జాలిలేని ఏలికలను నిలదీయాలని, అవసరమనుకుంటే సాగనంపాలని ప్రజలు కోరుకుంటారు. తమ తరపున పోరాడుతుందనుకున్న విపక్షం స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంతో చేతులు కలిపితే జనానికి దిక్కేది. అధికార, విపక్ష వర్గాలు ఏకమైపోయిన విడ్డూరం మన రాష్టంలో నెలకొందిప్పుడు.

ప్రజాకంటక పాలన సాగిస్తున్న కిరణ్ సర్కారు ఇన్ని రోజులు మనగలిగిందంటే అదంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు పుణ్యమేనని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రెస్ మీట్ లు పెట్టి పబ్లిగ్గా చెబుతున్నారు. హస్తం ప్రభుత్వం పడిపోకుండా చేయి అడ్డుపెడుతున్నది ఆయనేనని తాజాగా మరోసారి రుజువయింది. తమ పార్టీకి రాజీనామా చేసిన 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామని పీసీసీ అధ్యక్ష హోదాలో బొత్స సత్తిబాబు గాంధీభవన్ సాక్షిగా మాట జారారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తగ్గారు కాబట్టి కనీస బలానికి కోత పడి ప్రభుత్వానికి కొనసాగే హక్కు పోయింది. ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు తప్ప ఈ విషయం అందరికీ తెలుసు. అవిశ్వాసానికి ఇంకా 'అవసరం' రాలేదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం.

ప్రజలను కాల్చుకుతింటున్న కాంగ్రెస్ సర్కారు ఒక్క నిమిషం కూడా కొనసాగేందుకు అర్హత లేదంటూ జనం మధ్యలో డైలాగులు దంచే బాబుగారు అవిశ్వాసానికి మాత్రం ససేమిరా అంటున్నారు. పోనీ, కిరణ్ సర్కారు బాగా పని చేస్తుందా అని అడిగితే- ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటారు హైటెక్ బాబు. పనిచేయని ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టరని అడిగితే- అవసరమైతే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని ప్రధాన ప్రతిపక్ష నేత గడుసుగా సమాధాన మిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాదయాత్ర సందర్భంగా జనం నిలదీయడంతో చంద్రబాబు నుంచి వచ్చిన జవాబిమిది. తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన బాబు- పన్నులతో ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునివడం కొసమెరుపు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి జనాలకే కాదు తెలుగు తమ్ముళ్లకే అంతుబట్టడం లేదు. బాబు విపక్ష నేతగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సొంత పార్టీలోనే జోకులు పేలుతున్నాయి(ట).

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=57238&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: