గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు...

గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు...

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

జనానికి గుక్కెడు నీరుఇవ్వలేకపోతోంది
వైఎస్‌ఆర్ ఉంటే పట్నం చెరువుకు కృష్ణా జలాలు వచ్చేవి
మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా
మంచాల మండలం ఆగపల్లిలో షర్మిల

 ప్రజలకు తాగడానికి గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు సిగ్గులేదని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న ఇబ్రహీంపట్న ప్రాంతవాసులకు రక్షిత నీటిని అందించాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కృష్ణాజలాల సరఫరాకు శ్రీకారం చుడితే... ప్రస్తుత ప్రభుత్వం ఈ నీటిని కూడా సమృద్ధిగా పంపిణీ చేయకుండా బోరు నీటిని కలిపి సరఫరా చేయడం దారుణమన్నారు.
ఫ్లోరైడ్ నీటిని తాగి ఇక్కడి ప్రజలువైకల్యానికి గురవుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం.. అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్ర గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉధృతంగా సాగింది. మంచాల మండలం ఆగపల్లిలో జరిగిన ‘రచ్చబండ’లో షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. 

‘పట్నం’ చెరువును నింపాలని నాన్న తలపెడితే..
తీవ్ర దుర్భిక్షంతో అల్లాడే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ భావించారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణానీటితో నింపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కారు చెరువును నీటితో నింపే ప్రయత్నాలు చేయక ఈ ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. చెరువులో నీళ్లు లేక సమీప ప్రాంతాలన్నీ భూగర్భ జలాల లేమితో అల్లాడిపోతుంటే సిగ్గులేని ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణాజలాలతో నింపి ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చి.. సేద్యానికి వీలుగా నీరందిస్తామన్నారు. 

పన్నులు వేయకుండా అన్నీ కల్పిస్తే
పన్నులు వేయకుండా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ సర్కారు పనిచేస్తే.. కిరణ్ సర్కారు గత మూడేళ్లలో పన్నులతో ప్రజల నడ్డివిరిచిందని విమర్శించారు. గ్యాస్ ధరలు, కరెంట్‌చార్జీలు ఎడాపెడా పెంచేస్తూ ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశన్నంటితే సాధారణ ప్రజానీకం బతికేదెట్లా అని నిలదీశారు. ‘చెప్పండమ్మా మీలో ఎవరికైనా ఏడుగంటల కరెంటు సరఫరా అవుతోందా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ కూడా సరిగా విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పకపోవడంతో షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది చేతగాని ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ కూలీచేసుకుంటే వచ్చేవి వందా రెండువందలే కదా! అలాంటప్పుడు చేసిన కూలి డబ్బులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకే సరిపోవడంలేదు. మరి పేదవాళ్లు ఎలా బతికేది.. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుండేదా’ అని ఆవేదన వ్యక్తంచేశారు. 

వడ్డీలేని రుణాలు ఇచ్చి ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుకన్న రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వ కృషిచేయడంలేదని ఆమె అన్నారు. పావలావడ్డీ రుణాలు అందడంలేదని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవగా.. ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ జనార్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు రాజ్‌ఠాకూర్, దేప భాస్కరరెడ్డి, కొండా రాఘవరెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, వంగ మధుసూదన్‌రెడ్డి, అమృతాసాగర్, సురేశ్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, ఉపేందర్‌రెడ్డి, రూపానందరెడ్డి, బొక్క జంగారెడ్డి, కొలను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అదే ఉత్సాహం...
మహానేత వైఎస్‌ఆర్ తనయ షర్మిల సాగిస్తున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత పునఃప్రారంభించిన రెండో రోజూ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాలేజీ విద్యార్థులు పట్టుబట్టిమరీ ఆమెను కలిసేందుకు పోటీపడ్డారు. నాగార్జునసాగర్ రోడ్డు మీదుగా సాగిన పాదయాత్రకు ఎక్కడి ప్రజలు అక్కడే ఆగి ఆత్మీయ అతిథిని ఆప్యాయంగా పలకరించారు. ఇబ్రహీంపట్నంలో బుధవారం జరిగిన సభ జనసంధ్రాన్ని తలపించడంతో మంచి ఊపుతో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గురువారం రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నారు. పూర్తిగా అటవీ ప్రాం తం గుండానే యాత్ర సాగినా.. సాగ ర్హ్రదారి జన జాతరను తలపించింది. పోటెత్తిన అభిమానాన్ని నిలువరించలేక.. సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షర్మిల పాదయాత్ర సక్సెస్‌కావడంతో బెంబేలెత్తిన పాలక, ప్రతిపక్షపార్టీల నేతలు.. గుట్టుగా యాత్ర సాగుతున్న తీరును గమనించడం గమనార్హం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడాన్ని చూసి బిత్తరపోయారు. ఇదే ఊపు కొనసాగితే తమ రాజకీయ మనుగడ కష్టమేనని గుసగుసలాడారు.
Share this article :

0 comments: