అడ్డదారుల్లో ‘సహకార’ విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డదారుల్లో ‘సహకార’ విజయం

అడ్డదారుల్లో ‘సహకార’ విజయం

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

అన్ని రకాల అడ్డదారులూ తొక్కి... అన్ని స్థాయిల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి... అధికారపార్టీ ఎట్టకేలకు సహకార ఎన్నికల్లో పైచేయి సాధించాననిపించుకుంది. అధికార పార్టీ అక్రమాలన్నిటికీ ఎదురొడ్డి కడప జిల్లా ప్రజలు వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులకే పట్టం కట్టారు. కడప జిల్లాలో అత్యధికంగా 22 స్థానాల్లో ఎన్నికలను అధికార పార్టీ వాయిదా వేసి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులపై ఆధిక్యత చూపించుకోవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. కడప జిల్లాలో 54 స్థానాలకు(రెండు విడతల్లో) ఎన్నికలు నిర్వహిస్తే 34 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారు. 

అన్ని అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 15 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పెద్దగా ఆధిక్యతను చాటుకోలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు దాదాపు సమానంగా స్థానాలను సాధించారు. మొత్తం మీద రాయలసీమలో కాంగ్రెస్‌కు దీటుగా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు సత్తా చాటుకోగా టీడీపీ మూడోస్థానంలో ఉండిపోయింది. కృష్ణా, గుంటూరులాంటి చోట్ల టీడీపీ ఆధిక్యాన్ని చాటుకున్నా, కోస్తా జిల్లాలు మొత్తంగా తీసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యం కనపరిచింది. సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి సొంత జిల్లా గుంటూరులో రెండవ విడత ఎన్నికల్లో టీడీపీ 31 స్థానాలు సాధించగా... కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రం 24 స్థానాలకే పరిమితమయ్యారు. ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు 22 స్థానాల్లో గెలుపొందారు. తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ ప్రభావం చూపలేకపోయింది. బహుశా ఈ కారణంతోనే కాంగ్రెస్ మద్దతుదారులు తెలంగాణ జిల్లాలో తిరుగులేని ఆధిక్యతను కనపరిచారు. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో టీడీపీ రెండో విడత ఎన్నికల్లో ‘సింగిల్ డిజిట్’కే పరిమితమయ్యింది. మెదక్‌లో రెండోవిడత జరిగిన ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 40 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతను చాటుకుంది.
Share this article :

0 comments: