హస్తమంటే ఎంత ప్రేమో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హస్తమంటే ఎంత ప్రేమో!

హస్తమంటే ఎంత ప్రేమో!

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013


ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడతారా? నో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చరు. కూల్చే ప్రయత్నం కూడా చేయరని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. బుధవారం తనను కలిసిన నాయకులతో ఆయన మాట్లాడుతూ.. సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీలో చక్రం తిప్పారేమో గాని.. ఇప్పుడా చక్రానికి అవసరమైన అసలు ‘కీ’ ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఆయనే తిరగాలి...! అంటూ అదిగో టీవీ చూస్తే తెలియడంలేదా అని చేయి పెకైత్తి మరీ తన వాదనకు బలమైన ఆధారంగా చూపారు. టీవీలో ఏమొస్తోందోనని అంతా ఆసక్తిగా అటువైపు చూడగా చంద్రబాబు పాదయాత్ర కార్యక్రమం ప్రసారమవుతోంది.

గుంటూరులో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు అవిశ్వాసం గురించి ఏదో మాట్లాడినట్టున్నారని ఒక నాయకుడు చెబుతుండగా.. అదికాదన్నా...! చంద్రబాబు ఏం చేస్తున్నారో చూడంటూ మళ్లీ టీవీైవైపు దృష్టి మళ్లించారు. చూడండి...! ఎలా హస్తం చూపిస్తున్నారో...! (ఆ సమయంలో చంద్రబాబు పదే పదే చేయి పెకైత్తి అందరికీ అభివాదం చేస్తున్నారు) ఇంతకాలం రెండు వేళ్లు చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు హస్తమంతా చూపిస్తున్నారు. అది కూడా ఈ ఐదు నిమిషాల్లో ఓ యాభైసార్లన్నా చూపించారు. గమనించండి. అది చాలదా ఆయనకు హస్తమంటే ఎంత ప్రేమో...! అనడంతో ఒక్కసారిగా అంతా గొల్లుమన్నారు.
Share this article :

0 comments: