కిరణ్ వల్లే కరెంటు కష్టాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ వల్లే కరెంటు కష్టాలు

కిరణ్ వల్లే కరెంటు కష్టాలు

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

వైఎస్సార్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి.. అమలు చేసి చూపించారు 
విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల వివరాలను వైఎస్ వేళ్ల మీద చెప్పేవారు 
ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలీదు 
తమకు 2 గంటలే కరెంటు వస్తోందని యాత్రలో షర్మిలకు ప్రజల మొర
ఆ రెండు గంటలకే వేలకు వేల బిల్లు వస్తోందని ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 59, కిలోమీటర్లు: 852.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వానికి ముందు చూపు ఉండి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ కరెంటు కష్టాలు వచ్చేవి కావు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ హామీని అమలు చేసి చూపించారు. ఏ ప్రాజెక్టు నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? రాష్ట్రానికి ఎంత విద్యుత్ అవసరం? ఏ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఏ సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది వైఎస్సార్ వేళ్ల మీద లెక్కగట్టి చెప్పేవారు. ఇప్పటి పాలకులకు కనీసం ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 59వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఆగపల్లి రచ్చబండ కార్యక్రమంలో మస్తానమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘నాడు నాయిన(వైఎస్) ఉచిత కరెంటు ఇత్తాననిజెప్తే.. నాయిన మొకంజూసి కాంగ్రెస్‌కు ఓటేసినం. ఆయన బతికున్న రోజులంతా.. ఏడు గంటల ఉచిత కరెంటు ఇచ్చిండు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయిన రోజు నుంచి వేలకు వేల కరెంటు బిల్లులు పంపుతుండు. నాకు మూడెకరాల భూముంది. రోజుకు రెండు గంటల కరెంటు కూడా ఇడుస్తలేరు. కానీ కరెంటు బిల్లు రెండు నెలల కింద రూ.5000 వేలు వచ్చింది. ఇప్పుడు రూ.10 వేలొచ్చింది. ఏంజేసుకుంటారో జేసుకొమ్మను. నేను బిల్లు మాత్రం కట్టను బిడ్డా’’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంలో షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన దుస్థితి..

రోజుకు ఎన్ని గంటల కరెంటు వస్తుందో వేళ్లు పెకైత్తి చూపించాలని షర్మిల ఆగపల్లి రచ్చబండలో గ్రామస్తులను కోరగా.. కొంత మంది రెండు వేళ్లు, మరికొంత మంది మూడు వేళ్లు చూపించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, కరెంటు బిల్లు మాత్రం వేలకు వేల రూపాయలు వేస్తున్నారని విమర్శించారు. చార్జీల మీద సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలంటూ ప్రజల్ని పీల్చుకుతింటున్నారని దుయ్యబట్టారు. కరెంటు బిల్లు కట్టడానికి మహిళలు మంగళసూత్రాలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

చంద్రబాబు నాటకం..

‘‘ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతూ నాటకం ఆడుతున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నా కూడా.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘ఇదే బాబు హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. దీనికి నిరసనగా ఉద్యమాలు చేస్తే.. బషీర్‌బాగ్ వద్ద రైతులను పోలీసులతో కాల్పించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రానికి సీఈవో అని, హైటెక్ సీఎం అని గొప్పలు చెప్పుకొంటూ తిరిగారుకానీ.. రైతులను, వ్యవసాయాన్ని మాత్రం పట్టించుకోలేదు’’ అని షర్మిల దుయ్యబట్టారు.

గురువారం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద శాస్తా గార్డెన్స్ నుంచి ప్రారంభమైంది. ఖానాపూర్ గేటు, ఆగపల్లి, గునగల్ మీదుగా నడిచిన షర్మిల రాత్రికి చౌదరిపల్లిలో బస కేంద్రానికి చేరుకున్నారు. గురువారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు.
Share this article :

0 comments: