ఓడరేవును నిర్మించడానికి సముద్ర తీరంలో కాకుండా గోల్కొండ, హైటెక్‌సిటీ పక్కన భూములు కేటాయిస్తారా ? టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రసాద్ సంస్థలో 35 కోట్లు పెట్టుబడి పెట్టి 400 కోట్ల రూపాయల లాభం తీసుకున్నారనీ జగన్ సంస్థల్లో పెట్టుబడులకు ‘క్విడ్ ప్రొ కో’ అని నిందారోపణలు చేస్తున్న వారికి ఇందులో ఎలాంటి తప్పూ కనిపించలేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓడరేవును నిర్మించడానికి సముద్ర తీరంలో కాకుండా గోల్కొండ, హైటెక్‌సిటీ పక్కన భూములు కేటాయిస్తారా ? టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రసాద్ సంస్థలో 35 కోట్లు పెట్టుబడి పెట్టి 400 కోట్ల రూపాయల లాభం తీసుకున్నారనీ జగన్ సంస్థల్లో పెట్టుబడులకు ‘క్విడ్ ప్రొ కో’ అని నిందారోపణలు చేస్తున్న వారికి ఇందులో ఎలాంటి తప్పూ కనిపించలేదా?

ఓడరేవును నిర్మించడానికి సముద్ర తీరంలో కాకుండా గోల్కొండ, హైటెక్‌సిటీ పక్కన భూములు కేటాయిస్తారా ? టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రసాద్ సంస్థలో 35 కోట్లు పెట్టుబడి పెట్టి 400 కోట్ల రూపాయల లాభం తీసుకున్నారనీ జగన్ సంస్థల్లో పెట్టుబడులకు ‘క్విడ్ ప్రొ కో’ అని నిందారోపణలు చేస్తున్న వారికి ఇందులో ఎలాంటి తప్పూ కనిపించలేదా?

Written By news on Wednesday, May 16, 2012 | 5/16/2012

రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను భయపెట్టేందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసిందనీ దీని వెనుక కాంగ్రెస్, టీడీపీ, ఓ వర్గం మీడియా కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పిన సీబీఐ ప్రసాద్‌ను అరెస్టు చేయడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తామనే ప్రచారం లేవదీసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారనీ ప్రసాద్ అరెస్టుతో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయనీ ఆయన అన్నారు. 

ప్రసాద్ ఇపుడే కొత్తగా అవతరించిన పారిశ్రామికవేత్త కాదనీ ఇతరుల సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, ఆయన సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం, లాభాలు ఆర్జించడం ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని గట్టు పేర్కొన్నారు. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రసాద్ సంస్థలో 35 కోట్లు పెట్టుబడి పెట్టి 400 కోట్ల రూపాయల లాభం తీసుకున్నారనీ జగన్ సంస్థల్లో పెట్టుబడులకు ‘క్విడ్ ప్రొ కో’ అని నిందారోపణలు చేస్తున్న వారికి ఇందులో ఎలాంటి తప్పూ కనిపించలేదా? అని ప్రశ్నించారు. 

ప్రసాద్ ఒక్క సాక్షిలోనే పెట్టుబడులను పెట్టలేదనీ మాటీవీలో కూడా ఆయనకు అత్యధిక వాటా షేర్లు ఉన్నాయన్నారు. అంతే కాదు, పలు సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కూడా అన్నారు. భారతి సిమెంట్స్‌లో కూడా ఆయన 252 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫ్రెంచ్ సంస్థకు దానిని అమ్మేసినపుడు 560 కోట్ల రూపాయలు లాభంగా తీసుకున్నారని ఆయన అన్నారు. సాక్షిలో కూడా అదే విధంగా పెట్టుబడులు పెట్టారనీ ఆ సంస్థకు వచ్చే లాభాలను కూడా ప్రసాద్‌కు చెందుతాయన్నారు. ఈనాడు సంస్థలు తీవ్ర నష్టాల్లో ఉన్నపుడు పెట్టుబడులు పెట్టడానికి రాని వారు, వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారే అనే దుగ్ధతో ఆ పత్రిక యజమాని పనిగట్టుకుని వ్యతిరేక కుట్ర పన్నారని అందుకు కాంగ్రెస్, టీడీపీ సహకరించాయని ఆయన దుయ్యబట్టారు. 

తమకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వార్తలు ప్రచురించరాదనీ, ప్రసారాలు చేయరాదనీ కక్ష గట్టిన ఈనాడు, దాని తోక పత్రిక సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారిపై తొలి నుంచీ దుష్ర్పచారం చేస్తున్నాయనీ టీడీపీ, కాంగ్రెస్ అందుకు సహకరిస్తున్నాయనీ ఆయన అన్నారు. వాన్‌పిక్‌పై ఓ పత్రిక అడ్డగోలు కథనాలు రాసిందని ఆయన దుయ్యబట్టారు. వాన్‌పిక్‌కు కావాల్సిన 26 వేల ఎకరాల భూమిలో 13000 ఎకరాలు వైఎస్ హాయాంలో కేటాయించినట్లు రాశారనీ ఆ భూములు ప్రసాద్ సొంతంగా కొనుగోలు చేశారనే విషయం వారు తెలుసుకోవాలనీ ఆయన అన్నారు. అ

యినా ఓడరేవును నిర్మించడానికి సముద్ర తీరంలో కాకుండా గోల్కొండ, హైటెక్‌సిటీ పక్కన భూములు కేటాయిస్తారా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు రాసే పత్రికకూ దానిని మోసే వారికీ ఇంగితం ఉండాలని ఆయన విమర్శించారు. ఆ మాటకొస్తే గంగవరం, కాకినాడ పోర్టు ఒప్పందాల మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి పరిశ్రమలకు భూకేటాయింపులు చేస్తే వారు ఓ విధానం ప్రకారం చేసినట్లు, వై.ఎస్ చేస్తే విధానం కాదా అని ఆయన అన్నారు. సాక్షి పత్రిక నుంచి వై.ఎస్ బొమ్మను తొలగించాలంటున్న నాయకులు తమ దేహంలో ఉన్న చెయ్యిని నరికేసుకుంటారా? అని ప్రశ్నించారు. 

సీబీఐ దర్యాప్తు అనేది పిచ్చోడి చేతిలో రాయిలాంటిదనీ ఎవరినైనా అరెస్టు చేయాలంటే చేస్తుంది లేదంటే లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో కట్టలు కట్టలు నోట్లు దొరికితే దాని గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. రిజర్వు బ్యాంకు నిర్దేశక సూత్రాల మేరకు 20 వేల రూపాయలకు పైకబడిన చెల్లింపులన్నీ చెక్కుల రూపంలో చేస్తున్న జగన్ సంస్థల గురించి దుష్ర్పచారం చేస్తున్న వారు చిరంజీవి వియ్యంకుడి ఇంట్లోకి ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఎందుకు ఆరా తీయరని ఆయన అన్నారు.
Share this article :

0 comments: