చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కలిసి కాంగ్రెస్‌తో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కలిసి కాంగ్రెస్‌తో

చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కలిసి కాంగ్రెస్‌తో

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012



రాష్ట్రంలో రైతులు, పేదలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు
రోజూ వైఎస్ కుటుంబం మీద నోరు పారేసుకుంటున్నారేగాని.. ప్రజా సమస్యలు పట్టించుకోరేం!

కడప, న్యూస్‌లైన్: ‘మొన్న కడప ఉప ఎన్నికల్లో నన్ను ముస్లిం వ్యతిరేకి అన్నారు.. నేను బీజేపీలో కలిసిపోతున్నానన్నారు. ఈ ఉప ఎన్నికల్లో మళ్లీ మతం పేరుతో దుష్ర్పచారం మొదలుపెట్టారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని సైతం నీచ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ కలిసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇలా కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లాలో ఉప ఎన్నికలు జరగనున్న రాజంపేట నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తరఫున జగన్ వరుసగా రెండో రోజు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో ఆయన పర్యటించారు. రాజంపేటలో మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండు సర్కిల్‌లో పెద్ద ఎత్తున గుమికూడిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక రాజకీయాలు దిగజారిపోయాయి. ఎంతగా దిగజారిపోయాయీ అంటే.. ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న నాకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ-9 చానల్ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. కుమ్మక్కై.. జగన్ ముస్లిం వ్యతిరేకి.. బీజేపీలో కలిసిపోతున్నాడూ అని చెప్పి దుష్ర్పచారం చేశారు. జగన్‌ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలీ అని, జగన్‌ను రాజకీయంగా హత్య చేయాలీ అని కుట్ర పన్ని అందరూ కలిసి దుష్ర్పచారం చేశారు. కానీ ఆ పాచిక పారలేదు. ఆ దేవుడు పై నుంచి ఆశీర్వదించాడు. ఆ దివంగత నేతను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటైంది. కడప ప్రజలు.. కడప ముద్దుబిడ్డను అఖండమైన మెజారిటీతో గెలిపించారు. ఇవాళ మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ అంతా కలిసి మళ్లీ దుష్ర్పచారం మొదలు పెట్టారు. ఈసారి ముస్లిం సోదరులను పక్కనపెట్టేశారు... ఇక హిందూ సోదరులను పావులుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

నేనేం తప్పు చేశానయ్యా చంద్రబాబూ..

చివరకు వీరంతా ఏ స్థాయికి దిగజారిపోయారూ అంటే.. నేను తిరుపతికి వెళ్లి ఆ దేవుడి దర్శనం చేసుకుంటే.. దాంట్లో కూడా రాజకీయాలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నీచమైన మనుషులు. ఇవాళ పత్రికలో నేను చదివా.. చంద్రబాబు అంటున్నారట.. పీఠాధిపతుల దగ్గరకు వెళ్తారట.. (జగన్‌కు వ్యతిరేకంగా)వారిని కదిలిస్తారట. అయ్యా చంద్రబాబూ.. ఎందుకయ్యా మీరు పీఠాధిపతుల దగ్గరకు వెళ్తున్నారు? ఎందుకయ్యా వారిని కదిలిస్తున్నారు? నేను చేసిన తప్పేంటయ్యా..? చెప్పండయ్యా అని చంద్రబాబును అడగదలచుకున్నా. నన్ను ఒక్కడిని చేసి.. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, ఈనాడు, టీవీ-9, ఆంధ్రజ్యోతి అందరూ ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. అప్పటికప్పుడు కథలు అల్లుతున్నారు. వారే కథలు అల్లి.. వాటిపై వారే మాట్లాడేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలారా.. తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి 2009లో కూడా నేను వెళ్లా. నాడు ముఖ్యమంత్రి కొడుకుగా నేను వెళ్లా. ఆ వేళ ఎవ్వరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని అడగలేదు. ఈ రోజు ఎందుకు అడుగుతున్నారయ్యా అని ప్రశ్నిస్తున్నా. జగన్‌ను ఓడించడానికి, జగన్‌ను నాశనం చేయడానికి ఇంతమంది కలిసి దుష్ర్పచారం చేస్తున్నారు.. కుట్ర చేస్తున్నారు.

ఈ సమస్యలేవీ కనపడవా?

అయ్యా రాష్ట్రంలో ఇవాళ ఎన్నో సమస్యలున్నాయి.. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పసుపు ధర గిట్టుబాటుకాక రైతులు భోరున ఏడుస్తున్నారు.. హైదరాబాద్ దాకా వచ్చి నిరసనలు చేస్తున్నారు. అవేవీ మీకు కనపడడం లేదు. రైతు కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒక వైపేమో కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం అదే అక్కా చెల్లెమ్మలకు రోజుకు రూ.60, రూ.70 ఇచ్చి కాంట్రాక్టుపై పనులు చేయించుకుంటోంది. ప్రభుత్వం ఫీజులు కడుతుందో కట్టదో అన్న భయంతోనే ప్రతి పిల్లాడూ చదువుకునే పరిస్థితి. పేదవాడు అనారోగ్యంలో ఉండి 108 నంబరుకు ఫోన్ కొడితే కుయ్.. కుయ్.. కుయ్ అంటూ 20 నిమిషాల్లో వచ్చి తీసుకెళ్లాల్సిన అంబులెన్స్.. వస్తుందో రాదో అని ఆందోళన చెందాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను 135 వ్యాధులకు కుదించారు. విద్యుత్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితిలో ప్రజలు బాధపడుతున్నారు. మహానేత చనిపోయాక ఆ పేదవాడి కోసం ఒక్కటంటే ఒక్క ఇల్లూ కట్టించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడూ, అయ్యా కాంగ్రెస్ పెద్దలూ.. ఇవన్నీ మీకు కనపడడం లేదాయ్యా?

ప్రతి రోజూ వైఎస్ కుటుంబంపైనే..

ప్రజల సమస్యలు గాలికొదిలేశారు.. రోజూ పేపర్ చూస్తే.. రోజూ టీవీ చూస్తే.. జగన్‌ది ఆ మతం.. జగన్‌ది ఈ కులం.. జగన్ అలా చేశాడు.. జగన్ ఇలా చేశాడు.. చనిపోయిన వైఎస్ ఇది చేశాడూ.. అది చేశాడూ.. అని ఎప్పుడూ కూడా ఒక కుటుంబం గురించి నోరుపారేసుకుంటున్నారేగాని.. ప్రజల దగ్గరకు వెళ్లి... వారికేం కావాలి అన్న ఆలోచన చేశారా? ఆ ప్రజల కోసం పోరాడదాం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడదాం అన్న ఆలోచన అధికార పక్ష నేతలకైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నా.

ఆ 17మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నా..

రాజకీయాలలో పదవులకంటే ప్రజా సేవే ముఖ్యమని, బతికినన్నాళ్లు ప్రజా సేవకోసమే పాటుపడాలన్న ఆలోచనతో పదవులను తృణ ప్రాయంగా త్యజించిన ఆ 17 మంది ఎమ్మెల్యేలకు మరోమారు సెల్యూట్ చేస్తున్నా. పేదలకోసం, రైతుల కోసం వారు పదవులను పోగొట్టుకున్నారని సగర్వంగా చెబుతాన్నా. రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే పదవి పోతుందని తెలిసి కూడా నిజాయతీతో అమరన్న(ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి) ఓటేశారు. ఆయన్ను చూసి గర్వపడుతున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పేందుకు.. విలువలు తిరిగి తేవడానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక తులసి మొక్కలా నిలబడుతుందని గర్వంగా చెప్తున్నా. మీరు వేసే ఓటుతో పాలకులకు కనువిప్పు కలగాలని విజ్ఞప్తి చేస్తున్నా.
Share this article :

0 comments: