కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ జిల్లాల నేతల పిలుపు 
పోటీపై కేసీఆర్ పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విజయం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని, ఇదొక యజ్ఞంలా భావించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే కొండా సురేఖ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జిల్లాల కన్వీనర్లు, పరిశీలకులు, కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో పాటు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం సమావేశ వివరాలను పార్టీ తెలంగాణ జిల్లాల రీజినల్ సమన్వయకర్తలు బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డిలు విలేకరులకు వివరించారు. పరకాలలో కొండా సురేఖ విజయం కోసం అనుసరిం చాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీల కుట్రలను తిప్పికొట్టే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు ఇన్‌చార్జిలను నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, టీడీపీల కంటే వైఎస్‌ఆర్ సీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినందుకే.. రాజీనామా చేసిన వారి స్థానాల్లో తమ పార్టీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. 

టీ-జేఏసీ పిలుపు మేరకే సురేఖ రాజీనామా 

తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే కొండా సురేఖ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారని బాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డలైతే అవిశ్వాసాన్ని నెగ్గించాలని జేఏసీ చైర్మన్ కోదండరాం, స్వామిగౌడ్‌లు ప్రకటనలు చేశారని, పదవులు పోతే గెలిపించే బాధ్యత తమదేనని వారిచ్చిన వాగ్దానాలను గుర్తుచేశారు. ఈ విషయమై రాజకీయ జేఏసీ మద్దతు కోరుతూ త్వరలో లేఖ రాయనున్నట్లు ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం సురేఖ గతంలో రెండుసార్లు రాజీనామా చేసిందనీ, ఆమె చేసిన రాజీనామా ఇప్పటికీ స్పీకర్ వద్ద పెండింగ్‌లోనే ఉందన్నారు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే స్పీకర్ ఆమోదించలేదని చెప్పారు. కానీ కొన్ని పార్టీలు, ఓ వర్గం మీడియా తమ పార్టీనేతలు, అధ్యక్షుడిపై దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. అలాగే, పరకాల ఉప ఎన్నికపై కేసీఆర్ పునరాలోచించుకోవాలన్నారు. పరకాలలో కొండా సురేఖ తప్పకుండా గెలుస్తారని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఏదైనా తెలంగాణవాదాన్ని గెలిపించాలన్న జేఏసీ పిలుపును గౌరవించి బాసటగా నిలిచింది సురేఖ మాత్రమేనని కేకే మహేందర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖ, తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారని వివరించారు.
Share this article :

0 comments: