వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తిరుపతి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తిరుపతి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తిరుపతి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

- తిమ్మినాయుడుపాలెం నుంచి టౌన్‌క్లబ్ దాకా రోడ్ షో
- 13 చోట్ల సభలు
- వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం
- రేపే శ్రీవారి దర్శనం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తిరుపతి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీకి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఏర్పాటు తర్వాత జిల్లాకు తొలిసారి ఎన్నికల ప్రచారం కోసం వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో, ప్రచార సభల గురించి మూడు రోజులుగా ప్రచారం చేయడంతో ఆయన్ను చూడాలని జనం ఎదురుచూస్తున్నారు.

తిరుపతి-న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉప ఎన్నిక ప్రచారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుపతికి వస్తున్నారు. ఉదయం 7-30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కరుణాకరరెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకున్న తర్వాత తిమ్మినాయుడుపాలెం సభకు బయల్దేరి వెళతారు.

భారీ స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగుల ఏర్పాటుకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో పార్టీ శ్రేణులు ఆ దిశగా ప్రయత్నాలు మానుకున్నాయి. జన హోరుతో సభలను విజయవంతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం తిరుపతికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సభలు జరిగే సమయం తెలియజేస్తూ ప్రచారం జరుపుతున్నారు.

నేటి పర్యటన ఇలా...

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం పర్యటన వివరాలను పార్టీ పోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు తిమ్మినాయుడుపాలెంలో ప్రారంభమయ్యే ప్రచారం సత్యనారాయణపురం జంక్షన్, జీవకోన, జీవలింగేశ్వరస్వామి ఆలయం, లీలామహల్ జంక్షన్, టీఎంఆర్ కల్యాణమండపం సర్కిల్, తుడా సర్కిల్, రైల్వేకాలనీ, శ్రీనివాసమహల్ జంక్షన్, అన్నారావు సర్కిల్, చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ ఆఫీసు, పాత మెటర్నిటీ ఆస్పత్రి జంక్షన్, జ్యోతి థియేటర్ సర్కిల్ మీదుగా కొనసాగి టౌన్‌క్లబ్ సర్కిల్ వద్ద సభతో తొలిరోజు ప్రచారం ముగుస్తుందని తెలిపారు. 

అదేరోజు రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు చేరుకుని బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని చెప్పారు. ఉదయం 8 గoటలకు బయల్దేరి 9 గంటలకు తిరుపతి ఆటోనగర్‌లో రెండో రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కళాంజలిసర్కిల్, లక్ష్మీపురం, టీవీఎస్ షోరూం, డీఆర్‌మహల్ సర్కిల్, కృష్ణాపురం ఠాణా, నాలుగుకాళ్ల మండపం, శ్రీదేవి కాంప్లెక్స్, పెద్దకాపువీధి సర్కిల్, బైరాగిపట్టెడ, పళనిథియేటర్ మీదుగా ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్ వద్ద జరిగే సభతో ప్రచారం ముగుస్తుందన్నారు. రాత్రికి తిరుపతిలో కరుణాకరరెడ్డి ఇంట్లో బస చేసి గురువారం ఉదయం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారని రఘురాం, ప్రతాపరెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: