నేటి నుంచి జగన్ ఉప ఎన్నికల ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి జగన్ ఉప ఎన్నికల ప్రచారం

నేటి నుంచి జగన్ ఉప ఎన్నికల ప్రచారం

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 18వ తేదీ వరకు 8 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం సాగుతుంది. మంగళ, బుధవారాల్లో తిరుపతి, 3, 4 తేదీల్లో రాజంపేట, 5న రాయచోటి, 6, 7 తేదీల్లో అనంతపురం, 8, 9, 10, 11 తేదీల్లో రాయదుర్గం, 12, 13, 14 తేదీల్లో ఎమ్మిగనూరు, 15, 16 తేదీల్లో ఆళ్లగడ్డ, 17, 18 తేదీల్లో రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. జగన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి బయలుదేరతారు.
Share this article :

0 comments: