జగన్ పక్కన నిలబడడమే అదృష్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పక్కన నిలబడడమే అదృష్టం

జగన్ పక్కన నిలబడడమే అదృష్టం

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన నిలబడడమే ఒక అదృష్టమని యువనాయకుడు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ముత్యాలరెడ్డిపల్లి కూడలిలో మంగళవారం సాయంత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలనుద్దేసించి ప్రసంగించాల్సిందిగా మిథున్‌రెడ్డిని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న పక్కన నిలబడడమే ఒక అదృష్టమని, అలాంటిది తాను ప్రసంగించడం ఇంకా గొప్ప అదృష్టమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఎమ్మార్‌పల్లిలో వర్షం పడి వాతావరణం చల్లబడిందన్నారు. అది జగన్‌మోహన్‌రెడ్డి గొప్పతనమని, వరుణదేవుడికి ఓటు హక్కు ఉంటే జగన్‌మోహన్‌రెడ్డికే వేస్తారన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిం చాలని ప్రజలను కోరారు.

తిరుపతి ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల ప్రచారం కోసం తిరుపతిలో పర్యటించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రెండవ రోజు జనం నీరాజనం పట్టారు. నాయకులు వెంకట సుబ్బారెడ్డి, ఉపేంద్ర ఆధ్వర్యంలో కృష్ణాపురం ఠాణా వద్ద అరటిమానులు, మామిడి తోరణాలు కట్టి జాతరను తలిపించేలా వాతావరణాన్ని కల్పించారు. జగన్ మోహన్‌రెడ్డి రాకకోసం మహిళలు చంటి బిడ్డలతో మండు టెండను సైతం లెక్క చేయక ఎదురు చూశారు. ముస్లింలు సైతం వృద్ధులు, యువకులు మహానేత తనయుడుని చూసేందుకు ఎండలో గంటల తరబడి వేచి చూశారు. పోలీసులు వచ్చి వెనక్కి వెళ్లాలని చెప్పినా వృద్ధులు వారిని ఎదిరించి అక్కడే వేచి చూశారు. యువనేత రాకకు ముందు సభాస్థలానికి చేరుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు అంబటిరాంబాబు, రోజా ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకోగానే నాయకులు, ప్రజలు పచ్చటి తోరణాలు, మేళతాళాలతో కరతాళ ధ్వనులు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వృద్ధులు, చంటి బిడ్డల తల్లులను, జననేత గుర్తించి ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిపోయారు. ఎండలో నిలబడి జనం జగన్ ప్రసంగాన్ని విన్నారు. సమస్యలు పరిష్కరించాలని యువనేతకు వినతి పత్రం సమర్పించారు. అక్కడ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అడుగడుగునా మహిళలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. నాలుగు కాళ్ల మం డపం వద్ద జయరామ్ యాదవ్ ఆధ్వర్యంలో మహానేత వైఎస్‌ఆర్, జగన్ బ్యానర్లతో యువనేతకు స్వాగతం పలికారు. 


ప్రజల్ని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం
కృష్ణాపురం ఠాణా వద్ద యువనేత కోసం రోడ్డుపై వేచి ఉన్న జనాన్ని తరిమేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ యువనేత పర్యటన కార్యక్రమాలకు ముందస్తుగా అనుమతి తీసుకున్నా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రోడ్డుపైనున్న జనాన్ని తరిమేందుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. టీడీపీ నేత చంద్రబాబు, సీఎం రోడ్ షోలకు రెండు గంటల ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన పోలీ సులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. పోలీసులు జనంపై జులుం ప్రదర్శిస్తే నడిరోడ్డుపై బైఠాయిస్తామని హెచ్చరించారు. దీంతో వారు కాస్త వెనక్కు తగ్గారు.
Share this article :

0 comments: