అమరన్నను ఆశీర్వదించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమరన్నను ఆశీర్వదించండి

అమరన్నను ఆశీర్వదించండి

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012



- విలువలు, విశ్వసనీయత కోసమే రాజీనామా
- కుళ్లు, కుతంత్రాలను తరిమికొట్టండి
- వైఎస్ జగన్ పిలుపు 
‘కుళ్లు కుతంత్రాలను తరిమి కొట్టండి.. రైతులు, పేదలకు అండగా నిలిచిన అమరన్నను ఆశీర్వదించండి’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు భారీ జనస్పందన లభించింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ జగన్ పర్యటించిన ప్రాంతాలు జన సంద్రమయ్యాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్‌ను చూడాలని మహిళలు, పిల్లలు, వృద్ధులు గంటలకొద్దీ నిరీక్షించారు. జగన్ ప్రసంగానికి జేజేలు పలికారు.

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: విలువలు, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన అమరనాథరెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో శుక్రవారం జరిగిన సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రజలతో ప్రజా సంక్షేమంతో పని లేకుండా కుళ్లు రాజకీయాలు చేసుకునేవారు ఒకర కమని, విలువలు, విశ్వసనీయత కోసమే పని చేసేవారు మరో రకం నాయకులని అన్నారు. అమరన్న రెండో కోవకు చెందుతారని కొనియాడారు.

పస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరన్నారు. రైతులు, పేద ప్రజలకు అండగా నిలిచేందుకే అమరన్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారన్నారు. ఆ సమయంలో తన పదవి పోతుందని, ఆ తర్వాత జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీతో ఢీ కొనాలని, మంత్రులు సంచుల కొద్దీ డబ్బులు వెదజల్లుతారని, పోలీసులు అధికార పక్షం వైపు ఉంటారని తెలిసి కూడా నిజాయితీ రాజకీయాలకు కట్టుబడ్డారన్నారు.

అడుగడుగునా అడ్డొచ్చిన అభిమానం....

వైఎస్ జగన్ పర్యటనకు గ్రామీణుల అభిమానం అడుగడుగునా అడ్డు పడింది. ప్రతి పల్లెలోనూ జగన్ కాన్వాయ్ దిగి ప్రజలతో మమేకమయ్యారు. ఆత్మీయంగా చేతితో చెంపలు తడిమారు. వృద్ధుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సువర్ణ యుగం వస్తుందని, అప్పుడు అందరి కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చారు. మర్రిమానుక్రాస్, కొత్తరోడ్డు, మాదిరెడ్డిగారిపల్లె, కోనేటివాండ్లపల్లె, గుర్రప్పగారిపల్లె, బాలసానివాండ్లపల్లె గ్రామాల మీదుగా మండల కేంద్రమైన వీరబల్లికు సాయంత్రం 7 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేలాదిగా తరలివచ్చిన జనాలతో ర్యాలీగా వీరబల్లిలోని వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకున్నారు.

అవ్వా వెళ్లొస్తా....బాయ్ చెల్లెమ్మా ...అన్నా వస్తానన్నా !

తన పర్యటనలో జగన్ ఆత్మీయ పలకరింపు ప్రజల గుండెలను హత్తుకుంది. పల్లెపల్లెనా ప్రసంగం ముగిసిన వెంటనే వెళ్లొస్తానవ్వా...బాయ్ చెల్లెమ్మా ...అన్నా వస్తానన్నా...అంటూ చేసిన పలకరింపులు ఆకట్టుకున్నాయి. సొంత ఇంటిలో మనిషిలా, వారిలో ఒకడిలా ఆత్మీయంగా మసులుకున్నారు. ఎన్నికల సమయం మించిపోవడంతో వైఎస్ జగన్ సుండుపల్లెలో తన పర్యటనను ముగించారు.

జగన్‌తో కోగటం ప్రతాప్‌రెడ్డి భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కమలాపురం నియోజకవర్గానికి చెందిన కోగటం ప్రతాప్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజంపేట పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ శుక్రవారం ఆకేపాటి భవన్‌లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రతాప్‌రెడ్డి కలిసి రెండు గంటల సేపు ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రతాప్‌రెడ్డి కమలాపురం శాసన సభ్యుడు వీరశివారెడ్డికి సోదరుడు కావడం గమనార్హం.

Share this article :

0 comments: