తూర్పు,పశ్చిమ లో వైఎస్సార్ సీపీ పాగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తూర్పు,పశ్చిమ లో వైఎస్సార్ సీపీ పాగా

తూర్పు,పశ్చిమ లో వైఎస్సార్ సీపీ పాగా

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

తూర్పుగోదావరి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలే రెండో విడతలో కూడా పునరావృతం అయ్యాయి. ఈ విడతలో సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఒంటరిని చేయాలనుకున్న అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం కుట్రలు, కుతంత్రాలు పనిచేయలేదు. 

ఈ విడతలో కాకినాడ, పెద్దాపురం డివిజన్‌ల పరిధిలో 336 పంచాయతీలకు ఎన్నికలు జరగగా శనివారం రాత్రి 11.30 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 96 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. రెండోస్థానంలో తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు 94 పంచాయతీలను గెలుపొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో మాదిరిగానే ఈసారి కూడా మూడోస్థానంలో 89 పంచాయతీల్లో గెలుపొందింది. 25 పంచాయతీల్లో స్వతంత్రులు గెలుపొందారు. వీరిలో అత్యధికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే ఉన్నారు. 

తొలి విడతలో ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌లు అడుగడుగునా కుమ్మక్కు రాజకీయాలు నెరిపినా వైఎస్సార్ సీపీ హవాను అడ్డుకోలేకపోయాయి.


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. అత్యధిక స్థానాలను చేజి క్కించుకుని టీడీపీ, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను వెనక్కు నెట్టారు. జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డివిజన్లలోని 18 మండలాల్లో 253 పంచాయతీలకు శనివారం పోలింగ్ జరగ్గా, సాయంత్రం నుంచి ఫలితాలు వెలువడ్డాయి. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 79 పంచాయతీల్లో విజయభేరి మోగించారు. 76 పంచాయతీల్లో గెలుపొంది తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలవగా, అధికార కాంగ్రెస్ పార్టీ 54 పంచాయతీలను కైవసం చేసుకుని మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. 10వేల కంటే ఎక్కువ ఓట్లున్న పంచాయతీల్లో ఆ పార్టీ పాగా వేసింది. పెనుగొండ, రేలంగి, కొయ్యలగూడెం (పరింపూడి), గోపాలపురం పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. పితాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెనుగొండ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు గెలుపొందడం విశేషం.
Share this article :

0 comments: