వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు

వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013

వైఎస్ ఆర్ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదువైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి
హైదరాబాద్: : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి శనివారం ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో వెల్లడించారు. ఆ మహానేత మరణించిన నాటి నుంచి రాష్ట ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భరోసాతోనే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని శోభానాగిరెడ్డి ఆరోపించారు.
 
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట విభజన ఓ ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ గురించి ఎందుకు ఆలోచించలేదని ఆమె ఈ సందర్బంగా బాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడకుండా సీమాంధ్ర టీడీపీ నేతల గొంతును బాబు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు భయపడి కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలు రాజీనామా నాటకాలడుతున్నాయన్నారు.
 
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా ప్రశ్నించే పరిస్థితి రాష్ట్ర నాయకులలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో విభజించు పాలించు అన్న బ్రిటిష్ సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తుందన్నారు. తెలంగాణ రాష్ట సమితి అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన ప్రకటనలకు కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంపై ఏకపక్షంగా ఏలా నిర్ణయం తీసుకున్నారని శోభానాగిరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
 
15 మంది ఎంపీల కోసం రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. భవిష్యత్తులో రాజధాని గురించి ఇరుప్రాంతలవారు ఘర్షణ పడే పరిస్థితి ఉందని ఆమె జోస్యం చెప్పారు. ఏ ప్రాంతం నుంచి రాష్ట్రానికి సీఎం అయిన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే వల్లే రాష్టంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయని శోభానాగిరెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: